AP:Covid-19 Media bulletin: @ Date: 03.12.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు కనబడుతున్నాయి. తాజాగా 63049మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 11మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 835మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,70,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,56,320మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 7014 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా మృతిచెందిన వారిలో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 03.12.20
No comments:
Post a Comment