AP:Covid-19 Media bulletin: @ Date: 09.01.21
కొత్తగా 199 మంది రాష్ట్రంలో కరోనా బారిన పడ్డారని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 423 మందికి కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. తాజా కేసులతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,84,689కి చేరింది.
గత 24 గంటల్లో 50,445 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 423 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 35 మంది.. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. చిత్తూరులో 23, విశాఖపట్నం 21, తూర్పు గోదావరిలో 20, అనంతపురంలో 15, పశ్చిమ గోదావరిలో 14, కర్నూలులో 12, నెల్లూరులో 11, కడపలో 7 చొప్పున కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 09.01.21
No comments:
Post a Comment