AP:Covid-19 Media bulletin: @ Date: 02.03.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 106 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,169 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 57 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,137కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,40,10,204 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 02.03.21
No comments:
Post a Comment