AP:Covid-19 Media bulletin: @ Date: 08.03.21
అమరావతి: ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 25,907 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,90,766కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7176కి చేరింది. 24 గంటల్లో 61 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1009 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,62,086 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 08.03.21
No comments:
Post a Comment