AP:Covid-19 Media bulletin: @ Date: 19.03.21
రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 246 మందికి పాజిటివ్ నిర్ధరణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 8,92,986 కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 246 కరోనా కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 8,92,986కు చేరింది. వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,187కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 131 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,83,890కు ఎగబాకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,909 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 24 గంటల వ్యవధిలో 31,546 కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 19.03.21
No comments:
Post a Comment