Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 13, 2021

Today AP:Covid-19 Media bulletin


 Today AP:Covid-19 Media bulletin

30.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,494 పరీక్షలు నిర్వహించగా.. 17,354 కేసులు నిర్ధారణ కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,01,690 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,90,360 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో నెల్లూరు, విశాఖలో ఏనిమిది మంది చొప్పున; విజయనగరంలో ఏడుగురు; చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశంలో ఆరుగురు చొప్పున, అనంతపురంలో ఐదుగురు; గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరిలో నలుగురేసి; కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో మగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,992కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,468 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,70,718కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,22,980 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 2,764 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్‌ బారినపడ్డారు.




29.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,035 పరీక్షలు నిర్వహించగా.. 14,792 కేసులు నిర్ధారణ కాగా.. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,84,336 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,03,866 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో అనంతపురం, విజయనగరం, పశ్చిమ గోదావరిలో ఏడుగురు చొప్పున; తూర్పు గోదావరిలో ఆరుగురు; చిత్తూరు, విశాఖలో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. నెల్లూరు, శ్రీకాకుళంలో నలుగురేసి; కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున; కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,928కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,188 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,62,250కి చేరినట్లు వైద్యా1,14,158 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 1,831 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 596 మంది వైరస్‌ బారినపడ్డారు.






28.04.21


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 10,69,544మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.




27.04.21

రాష్ట్రంలో కొత్తగా 11 వేల 434 కరోనా కేసులు, 64 మరణాలు

కొత్తగా 11 వేల 434 కరోనా కేసులు, 64 మరణాలు నమోదు, మహమ్మారితో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 8 మంది మృతి, అనంతపురం, తూ.గో, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి,   చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి, కర్నూలు, ప్రకాశం, విశాఖ, ప.గో జిల్లాల్లో నలుగురు చొప్పున మృత్యువాత.  కోలుకున్న మరో 4,304 మంది బాధితులు, ప్రస్తుతం 89,732 యాక్టివ్ కేసులు




26.04.21

ఏపీలో కొత్తగా 9,881 కేసులు , 51 మరణాలు AP లో కరోనా భారీగా విజృంభిస్తోంది . నిన్నటి కంటే కేసుల సంఖ్య తగ్గగా .. గత 24 గంటల్లో 9,881 కేసులు వచ్చాయి . 24 గంటల్లో కరోనాతో 51 మంది మృత్యువాత పడ్డారు . చిత్తూరు , నెల్లూరులో ఆరుగురు , కర్నూలు , విజయనగరంలో ఐదుగురు , అనంతపూర్ , తూ.గో , ప.గోలో నలుగురు , గుంటూరు , కడప , కృష్ణ , శ్రీకాకుళం , విశాఖలో ముగ్గురు , ప్రకాశంలో ఇద్దరు మరణించారు . దీంతో AP లో మొత్తం కేసుల సంఖ్య 10,43,441 కు చేరింది . మృతుల సంఖ్య 7,736 కి చేరింది .




25.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరసబారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 62,885 పరీక్షలు నిర్వహించగా.. 12,634 కేసులు నిర్ధారణ కాగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,33,560 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు; తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; అనంతపురం, కడప ఐదుగురు చొప్పున; చిత్తూరు, గుంటూరులో నలుగురేసి; ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున; కర్నూలులో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,685కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,304 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,36,143కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,680 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 331 మంది వైరస్‌ బారినపడ్డారు.




24.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు నిర్ధారణ కాగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,20,926 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున; అనంతపురం, చిత్తూరులో నలుగురేసి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ముగ్గురు చొప్పున; గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,421 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,471 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 1,581, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి.



23.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారి నిన్న 10 వేలు దాటిన కొవిడ్ కేసులు ఇవాళ 11వేల మార్క్‌ దాటింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు పది లక్షలు దాటాయి. కేసులతో పాటు క్రమంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,581 పరీక్షలు నిర్వహించగా.. 11,766 కేసులు నిర్ధారణ కాగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,09,228 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్‌తో నెల్లూరులో ఆరుగురు; చిత్తూరులో ఐదుగురు; తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున; విశాఖలో ముగ్గురు; గుంటూరు, విజయనగరంలో ఇద్దరేసి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,579కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,441 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,27,418కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 74,231 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,80,750 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,885, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి.




22.04.21

రాష్ట్రంలో కరోనా కేసులు

●రాష్ట్రంలో 10 వేలు దాటిన కరోనా కేసులు●రాష్ట్రంలో మరో 10,759 కరోనా కేసులు నమోదు ●రాష్ట్రంలో కరోనాతో మరో 31 మంది మృతి







21.04.21

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, అందులో కొత్తగా 9,716 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,86,703 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 7510 మంది మృతి చెందారు. ఇక కొత్త మరణాలు కృష్ణా జిల్లాలో 10 మంది, నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 3,359 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 918985 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 60,208 ఉన్నట్లు తెలిపింది.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కొత్త కేసులు

అనంతపురంలో- 849, చిత్తూరులో -1180, ఈస్ట్‌ గోదావరిలో – 830, గుంటూరు – 1236, వైఎస్సార కడప జిల్లా – 216, కృష్ణా – 294, కర్నూలు – 958, నెల్లూరు – 934, ప్రకాశం – 294, శ్రీకాకుళం – 1444, విశాఖ – 810, విజయనగరం – 565, వెస్ట్‌ గోదావరి – 106 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.




20.04.21

ఏపీలో కొత్తగా 8,987 కేసులు , 35 మరణాలు ఏపీలో కరోనా భారీగా విజృంభిస్తోంది . నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 8,987 కేసులు వచ్చాయి . 24 గంటల్లో కరోనాతో 35 మంది మృత్యువాత పడ్డారు . నెల్లూరులో 8 , చిత్తూరు , కడపలో ఐదుగురు , అనంతపురం , కృష్ణ , శ్రీకాకుళంలో ముగ్గురు , కర్నూలులో ఇద్దరు , ప్రకాశంలో ఇద్దరు , తూ.గో , గుంటూరు , విశాఖ , విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు . దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,76,987 కు చేరింది . మృతుల సంఖ్య 7472 కి చేరింది .




19.04.21

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 37,765 మంది శాంపిళ్లను తీసుకుని పరీక్షించగా, అందులో కొత్తగా 5,963 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 968000 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో, వైఎస్‌ కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, అనంతపురంలో ఒకరు చొప్పున మొత్తం 17 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,569 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 9,09,615 కాగా, మృతి చెందిన వారి సంఖ్య7,437 మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనాతో 48,053 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.




18.04.21

◆పాజిటివ్ కేసులు :6582

◆రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,59,142 పాజిటివ్ కేసు లకు గాను 9,07,046 మంది డిశ్చార్జ్ కాగా 7,410 మంది మరణించారు

◆ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,686




17.04.21

ఏపీలో కరోనా విజృంభణ ఆంధ్రప్రదేశ్ లో కరోనా భారీగా విజృంభిస్తోంది . కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది . నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 7,224 కేసులు వచ్చాయి . 24 గంటల్లో కరోనాతో 15 మంది మృత్యువాత పడ్డారు . చిత్తూరులో 4 , నెల్లూరులో ముగ్గురు , కర్నూలులో ఇద్దరు , విశాఖలో ఇద్దరు , గుంటూరు , కడప , కృష్ణ , విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు . దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,55,455 కు చేరింది . మృతుల సంఖ్య 7388 కి చేరింది .




16.04.21

రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌లో తొలిసారి 6 వేలు దాటిన కరోనా కేసులు. రాష్ట్రంలో కొత్తగా 6,096 కరోనా కేసులు, 20 మరణాలు. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి

కరోనాతో అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి. కరోనాతో గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 1,745 మంది బాధితులు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,710 కరోనా యాక్టివ్ కేసులురాష్ట్రంలో 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు




15.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,741 పరీక్షలు నిర్వహించగా.. 5,086 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు చనిపోయారు. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,745 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో 200కుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.




14.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా.. 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,37,049 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురేసి, విశాఖలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,606 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,01,327కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో వందకుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.



13.04.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్థృతి కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,582 పరీక్షలు నిర్వహించగా.. 4,228 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,32,892 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,321కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,483 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,99,721కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,850 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,98,728 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 842, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.




Thanks for reading Today AP:Covid-19 Media bulletin

No comments:

Post a Comment