Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 1, 2021

Today AP:Covid-19 Media bulletin


 Today AP:Covid-19 Media bulletin

12.05.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్‌ పరీక్షించగా 21,452మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో బాధపడుతూ 89మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 8,988కి చేరింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 13,44,386 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,76,05,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో విశాఖలో 11మంది మృతి చెందగా, తూర్పుగోదావరి 9, కృష్ణా 9, విజయనగరం 9, చిత్తూరు 8, గుంటూరు 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, అనంతపురం 6, కర్నూలు 5, ప్రకాశం 4, పశ్చిమగోదావరి 3, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,927 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 693 మంది కరోనా బారిన పడ్డారు. ఇక 19,095మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, మొత్తం 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



11.05.21

అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 86,878 నమూనాలను పరీక్షించగా 20,345 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2426, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 707 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 108 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది, విశాఖపట్నంలో 12, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున, ప్రకాశంలో 9, నెల్లూరు 8, కృష్ణా 7, శ్రీకాకుళం 6, అనంతపురం, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 8,899కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 14,502 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,75,14,937 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,102 యాక్టివ్‌ కేసులున్నాయి.




10.05.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 14వేల మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 60,124 శాంపిల్స్‌ పరీక్షించగా, 14,986 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనాతో బాధపడుతూ 84మంది మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 423మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 16,167మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,74,28,059 శాంపిల్స్‌ను పరీక్షించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12మంది చొప్పున చనిపోగా, తూర్పుగోదావరి 10, విశాఖ 9, నెల్లూరు 8, విజయనగరం 8, చిత్తూరు 6, కర్నూలు 6, కృష్ణా 4, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 8,791కు చేరింది.



09.05.21

అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు  12,87,603 కేసులు నమోదవ్వగా.. మరణాలు 8,707కి పెరిగాయి.  తాజాగా 8,832 మంది వైరస్‌ నుంచి కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలోని 637 కొవిడ్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న 6,870 ఐసీయూ బెడ్లలో 6,323 ఇప్పటికే నిండిపోయినట్లు సింఘాల్‌ వివరించారు. రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండగా.. 22,265 నిండాయన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉండటం వల్ల 45 ఏళ్లు మించిన వారికే  వాక్సిన్ వేసేందుకు  కేంద్రాన్ని అనుమతి కోరగా.. సానుకూలంగా స్పందించిందని సింఘాల్‌ అన్నారు. దీనికి అనుగుణంగా మరో రెండు రోజుల్లో  కొవిన్‌ వెబ్‌ పోర్టల్లో మార్పులు చేస్తామన్నారు.

కొవిడ్‌  విధులు నిర్వర్తించేవారికి రెగ్యులర్‌ నియామకాల్లో 15 శాతం వరకు  వెయిటేజీ ఇస్తామని సింఘాల్‌ తెలిపారు. 6నెలలు సేవ చేస్తే.. 5మార్కులు,  ఏడాదికి 10 మార్కులు, ఏడాదిన్నకు 15 మార్కులు కేటాయిస్తామన్నారు. ఎవరికి ఎప్పుడు వాక్సిన్ వేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా చెప్పామని, రెండో డోసు వాక్సినేషన్‌కు మాత్రమే సరిపడా వ్యాక్సిన్‌ ప్రస్తుతం అందుబాటులో ఉందని అన్నారు. మొదటి డోసు టీకా ఎప్పటి నుంచి ఇస్తామన్న విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామన్నారు.



08.05.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శుక్రవారం కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే, గత 24 గంటల్లో మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 1,10,571 శాంపిల్స్‌ పరీక్షించగా, 20,065మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

చిత్తూరులో అత్యధికంగా  2,269 కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత తూర్పుగోదావరి  2,370, విశాఖ 2525లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7,065 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే  6,300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయానని వివరించారు.




07.05.21

అమరావతి: కరోనాతో బాధపడుతూ తాజాగా 73మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితిపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని, రెండో డోస్‌ టీకాలు తీసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. త్వరలో మరో 3.50లక్షల డోసులు ఇచ్చేందుకు సీరం అంగీకారం తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో రూ.180 కోట్లతో 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేశామని, ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు. అదే విధంగా కొవిడ్‌ విధుల్లోని సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,71,60,870 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో విజయనగరంలో 11మంది మృతి చెందగా, విశాఖ 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, గుంటూరు 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరి 5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, అనంతపురంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా 12,749మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 10,50,160మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు 2,260 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ప్రకాశం 385 మంది కరోనా బారిన పడ్డారు.



06.05.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించగా.. 21,954 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13,353 మంది ప్రస్తుతం కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,28,186 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,70,60,446 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

గత 24 గంటల్లో కొవిడ్‌తో విశాఖలో అత్యధికంగా 11మంది చనిపోగా, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, అనంతపురం 8, ప్రకాశం 6, చిత్తూరు 5, గుంటూరు 5, కృష్ణా 4, కర్నూలు 4, శ్రీకాకుళం, 4, నెల్లూరు 2 మృతి చెందారు.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కి చేరింది. 24 గంటల వ్యవధిలో 10,141 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 10,37,411 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 3,531 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో అత్యల్పంగా 548మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్‌ బారినపడ్డారు.




05.05.21

అమరావతి: ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు  ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, 85 మంది మృతి చెందారు. 

విశాఖ, విజయనగరంలో 11మంది మృతి

గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా.. అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్‌ పరీక్షించగా.. 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8374మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588 క్రియాశీల కేసులు ఉన్నాయి.




04.05.21

అమరావతి: ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయినట్టు  ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. అలాగే, 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు 21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టంచేశారు. 


శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కేసులు


గడిచిన 24గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398 కొత్త కేసులు రాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 793 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లాలో 12మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం జిల్లాలో 9మంది, తూర్పుగోదావరి 9, విశాఖ 9, విజయనగరం 9, నెల్లూరు 7, కృష్ణా 6, గుంటూరు 5, చిత్తూరు 4, కర్నూలు 4, ప్రకాశం 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజాగా 12,207మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,33,932 శాంపిల్స్‌ పరీక్షించగా.. 11,84,028మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,16,142మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8289మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 క్రియాశీల కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే..




03.05.21

అమరాతి: గత రెండు రోజులతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గినట్టే కనబడుతోంది. తాజాగా మరో 18వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,275 శాంపిల్స్‌ పరీక్షించగా.. 18,972 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా 10,227మంది కోలుకోగా.. 71మంది మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2628 కొత్త కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 969 కేసులు నమోదయ్యాయి.

తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9మంది చొప్పున కొవిడ్‌తో మృతి చెందగా.. అనంతపురం, కర్నూలులో ఏడుగురు చొప్పున ప్రాణాలు విడిచారు.  ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజా గణాంకాలతో కలుపుకొంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,67,18,148 శాంపిల్స్‌ పరీక్షించగా.. 11,63,994మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,03,935మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8207మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 క్రియాశీల కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి..




02.05.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత తొలిసారి 23వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 పరీక్షలు నిర్వహించగా.. 23,920 కేసులు నిర్ధారణ కాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,45,022 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,66,02,873 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో తూర్పు గోదావరిలో 12 మంది; విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది చొప్పున; ప్రకాశం, విజయనగరంలో ఏడుగురు చొప్పున; చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; గుంటూరులో ఐదుగురు; కర్నూల్‌లో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,136కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,411 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 9,93,708కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 2,945 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్‌ బారినపడ్డారు.




01.05.21

రాష్ట్రంలో 11,21,102 మంది వైరస్‌ బారినపడగా.. మరణాల సంఖ్య 8వేల మార్క్‌ దాటినట్లు  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,88,574 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో విజయనగరంలో 8 మంది; విశాఖ, చిత్తూరు, తూర్పు గోదావరిలో ఏడుగురు చొప్పున; అనంతపురంలో ఆరుగురు; ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున; నెల్లూరులో నలుగురు; గుంటూరు, కడప, శ్రీకాకుళంలో ఇద్దరేసి; పశ్చిమ గోదావరిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,053కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,579 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,82,297కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,30,752 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను పది జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.




Thanks for reading Today AP:Covid-19 Media bulletin

No comments:

Post a Comment