Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 1, 2021

Today AP:Covid-19 Media bulletin


 Today AP:Covid-19 Media bulletin

13.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,02,876 పరీక్షలు నిర్వహించగా.. 6,770 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,09,844 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,940కి చేరింది. 24 గంటల వ్యవధిలో 12,492 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,12,267 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,637 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,04,50,982 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



12.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా.. 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,577 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,99,775 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,48,106 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు నమోదయ్యాయి.



11.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,01,863 పరీక్షలు నిర్వహించగా.. 8,239 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల  61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,135 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,88,198కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,02,39,490 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,396 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి.



10.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో 97,863 మంది నమూనాలు పరీక్షించగా 8,110 కేసులు నమోదయ్యాయి. 67 మంది మృతి చెందారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 12,981 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 99,057 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



09.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 93,511 పరీక్షలు నిర్వహించగా.. 8,766 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,79,773 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 67 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,696కి చేరింది. 24 గంటల వ్యవధిలో 12,292 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,64,082కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,39,764 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,980, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 265 కేసులు నమోదయ్యాయి.



08.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త పెరిగాయి. గడచిన 24 గంటల్లో 89,732 మంది నమూనాలు పరీక్షించగా 7,796 కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి నిన్న 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



07.06.21



06.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 83,690 మంది నమూనాలు పరీక్షించగా 8,976 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 90 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గడచిన 24 గంటల్లో 13,568 కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తతం 1,23,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.



05.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది. గడచిన 24 గంటల్లో 15,958 మంది కొవిడ్‌ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




04.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 85,311 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 10,413 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 83 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది చనిపోయారు. కరోనా నుంచి నిన్న 15,649 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,773 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.




03.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 11,421 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 81 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,213కి చేరింది. గత 24 గంటల్లో 16,223 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న అత్యధికంగా 2,308 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.



02.06.21

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. కొత్తగా 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 98,048 శాంపిల్స్‌ పరీక్షించగా 12,768మంది కరోనా బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 15,612మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది.

ఇక గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 98మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో 15మంది చనిపోగా, నెల్లూరు, 10, పశ్చిమగోదావరి 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, విజయనగరం 8, గుంటూరు 7, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 6, కృష్ణా 5, వైఎస్‌ఆర్‌ కడప 4, కర్నూలులో నలుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 11,132మంది కన్నుమూశారు. ఇప్పటివరకూ 17,17,156మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్‌ కేసులున్నాయి.




01.06.21

అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొంత మేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,704 మంది నమూనాలను పరీక్షించగా 11,303 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.  అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,737 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




Thanks for reading Today AP:Covid-19 Media bulletin

No comments:

Post a Comment