Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 6, 2019

Do you know how much PF can withdraw?


  



కారణానికి ఎంత పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?
EPF Withdraw  ఉద్యోగులు సర్వీసులో ఉండగానే ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. అది కూడా *కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే. అడ్వాన్స్ ఎంత వస్తుందన్నది ఉద్యోగులు వెల్లడించే కారణాన్ని బట్టి ఉంటుంది*. మరి ఏఏ కారణాలతో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు? *ఏ కారణానికి ఎంత వరకు పీఎఫ్ అడ్వాన్స్ లభిస్తుంది? తెలుసుకోండి

1. ఉద్యోగులు ప్రతీ నెలా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసే డబ్బులు రిటైర్మెంట్ తర్వాతే కాదు

అంతకన్నా ముందే అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటాయి. ఉద్యోగులు తమ జీవితంలో ఒక్కసారైనా పీఎఫ్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. అవసరాలకు పీఎఫ్ అడ్వాన్స్‌గా తీసుకుంటూ ఉంటారు.

2. అనారోగ్యం, ఆస్పత్రి ఖర్చులు, పెళ్లిళ్లు, ఉన్నత విద్య, కొత్త ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం 

ఇలా కొన్ని కారణాలతోనే ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. కారణాలను బట్టి అడ్వాన్స్ ఎంత శాతం పొందొచ్చో తెలుస్తుంది.

3. ఉన్నత విద్య:

ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగి తన పిల్లల ఉన్నత విద్య కోసం పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఉద్యోగి వాటాలో వడ్డీతో కలిపి 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కారణంతో మూడు సార్లు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే వీలుంది.

4. పెళ్లి:

 ఉద్యోగి లేదా తన సోదరి, సోదరుడు, పిల్లల పెళ్లిళ్లకు ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే గత ఏడేళ్లుగా ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్ ఉండాలి. తన సర్వీస్ కాలంలో మూడుసార్లు పెళ్లి కారణంతో ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అది కూడా గరిష్టంగా 50% వరకే పరిమితం.

5. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు: 


కొత్త ఇల్లు, ప్లాట్, ఫ్లాట్ కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా సర్వీస్ కాలంలో ఒకసారి మాత్రమే ఈ కారణంతో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలి.

6. ఇల్లు కొనుగోలుకు అయ్యే మొత్తం

లేదా 36 నెలల బేసిక్ వేతనం+డీఏ లేదా ఉద్యోగి, యజమాని వాటా మొత్తం వడ్డీ... వీటిలో ఏది వర్తిస్తే అది మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. సబ్‌స్క్రైబర్ పేరు మీద లేదా ఉద్యోగి జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడిగా కొనే ఇంటికే వర్తిస్తుంది. 

7. అనారోగ్యం:

అనారోగ్య కారణాలు, వైద్య ఖర్చుల కోసం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి, వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు ఇది వర్తిస్తుంది. 6 నెలల బేసిక్ సాలరీ, డీఏ లేదా ఉద్యోగి మొత్తం వాటాలో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్, కనీస సర్వీస్ కాలం లాంటి నియమాలు వర్తించవు. 

8. రిటైర్మెంట్:

ఉద్యోగి 54 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఈపీఎఫ్ మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్‌కు ఏడాది ముందు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.

9. నిరుద్యోగం:

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ నెల రోజుల కన్నా ఎక్కువ ఉద్యోగం లేకుండా ఉంటే ఈపీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంది

Thanks for reading Do you know how much PF can withdraw?

No comments:

Post a Comment