Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 23, 2019

How to update/Change your mobile number in SBI Account


How to update/Change your mobile number in SBI Account

How to update/Change your mobile number in SBI Account SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి

SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి
SBI Mobile Number Change | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి. ఇందుకోసం మొత్తం మూడు మార్గాలున్నాయి
How to update/Change your mobile number in SBI Account SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి


SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి

ఈ రోజుల్లో లావాదేవీలు చాలావరకు ఆన్‌లైన్‌లో అయిపోతున్నాయి. అసలు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే ఉండట్లేదు. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఓసారి వెళ్తే చాలు. కొన్ని బ్యాంకులైతే ఆన్‌లైన్‌లోనే అకౌంట్ తెరిచే సదుపాయం కల్పిస్తున్నాయి. ఇంట్లో కంప్యూటర్, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు. లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ డేటా ఉంటే ఎలాంటి లావాదేవీలైనా క్షణాల్లో చేసెయ్యొచ్చు. మరి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి. ఇందుకోసం మొత్తం మూడు మార్గాలున్నాయి. ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్. రెండోది ఎస్‌బీఐ ఏటీఎం. మూడోది ఫోన్ బ్యాంకింగ్. మరి ఈ మూడు ఆప్షన్లతో మీ మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేయొచ్చో తెలుసుకోండి.

1. ఇంటర్నెట్ బ్యాంకింగ్

ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.


మీ ఎస్‌బీఐ అకౌంట్‌లో లాగిన్ అవండి.
కొత్త పేజీలో కనిపించే 'Accounts & Profile' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
డ్రాప్ డౌన్ మెనూలో 'Profile' క్లిక్ చేయండి.
కొత్త పేజీలో 'Personal Details/Mobile' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత వచ్చే పేజీలో of 'Personal Details' కనిపిస్తుంది.
మీ 'Profile Password' ఎంటర్ చేసి 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి.
కొత్త పేజీలో మీ పేరు, ఇమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
'Change Mobile Number-Domestic only (Through OTP/ATM/Contact Centre)' పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీలో 'Personal Details-Mobile Number Update' కనిపిస్తుంది.
మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
ఆ తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ అనే మెసేజ్ మీ మొబైల్ నెంబర్‌తో కనిపిస్తుంది.
మొబైల్ నెంబర్‌ సరిచూసుకొని ఓకే క్లిక్ చేయండి.
ఆ తర్వాత OTP, IRATA, Contact Centre అని మరో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
By OTP on both the Mobile Numbers ఆప్షన్ ఎంచుకొని 'Proceed' బటన్ క్లిక్ చేయండి.
మీ డెబిట్ కార్డ్ ఉన్న అకౌంట్ ఎంచుకోండి.
మీ ఏటీఎం కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి.
మీ ఫోన్‌కు రిఫరెన్స్ నెంబర్‌తో పాటు ఓటీపీ వస్తుంది.
ఆ తర్వాత మీ కొత్త నెంబర్ యాక్టివేషన్ కోరుతూ 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు.


2. IRATA: ఇంర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం

మీరు IRATA ఆప్షన్ ఎంచుకొని 'Proceed' క్లిక్ చేయండి.
మీ డెబిట్ కార్డ్ ఉన్న అకౌంట్ ఎంచుకొని 'Proceed' క్లిక్ చేయండి.
మీ ఏటీఎం కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి.
వేలిడేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్‌‌కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత దగ్గర్లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లి 'Services' ట్యాబ్ క్లిక్ చేసి మీ పిన్ ఎంటర్ చేయండి.
ఆ తర్వాత 'Others' ట్యాబ్ క్లిక్ చేసి 'Internet Banking Request Approval' ఆప్షన్ ఎంచుకోండి.
అప్రూవల్ కోసం 10 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి.
ధృవీకరణ పూర్తైన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది.
3. కాంటాక్ట్ సెంటర్

'Approval through Contact Centre' ఆప్షన్ ఎంచుకొని 'Proceed' క్లిక్ చేయండి.
కొత్త పేజీలో మీ డెబిట్ కార్డ్ ఉన్న అకౌంట్ ఎంచుకొని 'Proceed' క్లిక్ చేయండి.
మీ ఏటీఎం కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి.
వేలిడేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్‌‌కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
మూడు రోజుల్లో మీకు బ్యాంక్ కాంటాక్ట్ సెంటర్ పర్సన్ ఫోన్ చేస్తారు.
రిఫరెన్స్ నెంబర్ చెబితే మీ కొత్త మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది

Thanks for reading How to update/Change your mobile number in SBI Account

No comments:

Post a Comment