Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 24, 2019

What are the seven wonders of Andhra Pradesh and Telangana?


What are the seven wonders of Andhra Pradesh and Telangana? 

ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో వున్న అద్భుత వింతలు మీకు తెలుసా ?

1.బొర్రా గుహలు

బొర్రా గుహలు అనంత గిరి హిల్స్ లో ఒక భాగం. ఇవి ఇండియా లోనే అతి పెద్ద గుహలు. సముద్రమట్టానికి సుమారు 2,313 అడుగుల ఎత్తున కలవు.ఈ గుహాలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా వుంటాయి. చాలా అందమైనవి. సున్నపు రాయి తో ఏర్పడినవి. దేశం లోనే అతి లోతైన గుహలు గా ప్రసిద్ధి కెక్కాయి.
What are the seven wonders of Andhra Pradesh and Telangana ?ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో వున్న అద్భుత వింతలు మీకు తెలుసా ?


1807 సంవత్సరం లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి విలియం కింగ్ జార్జ్ ఈ గుహలను కనిపెట్టాడు. అప్పటి నుండి ఈ గుహలు ఈ ప్రాంతం లో ఒక ఆకర్షణగా ప్రసిద్ధి కెక్కాయి.

2.వరంగల్లు కోట

వరంగల్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు మచ్చుతునక ఈ కోట. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు క్రీ.శ 1199 సం. లో కోట నిర్మాణం మొదలు పెట్టాడు అతని కుమార్తె రాణి రుద్రమ దేవి 1261 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కోట శిధిలాలను మాత్రమే ఇక్కడ చూడవచ్చు. ఈ కోట నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలు కలిగిఉన్నది. చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నవారికి ఈ కోట


సందర్శనీయమైనది. రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు కళాకారుల ఆ నాటి కళాకారుల పనితనానికి నిదర్శనం.
కాకతీయుల నాటి పురాతనమైన రాతి కట్టడాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్న ఖిలావరంగల్‌ కోట ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత దీనిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణా పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్‌ మధ్య కోటలోని నాలుగు కాకతీయ కళాతోరణాల మధ్య రూ.4కోట్లతో సౌండ్స్‌, లైటింగ్‌, లేజర్‌షోను ఏర్పాటు చేశారు.
ఈ కోటను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ కోటలోని శిధిలాలను మాత్రమే దర్శించవచ్చు. దేవతల విగ్రహాలు, కోట గోడలు, కోటలోని భాగాలను చూడవచ్చు. కోట చుట్టూ కట్టబడిని మట్టి గోడ, రాతి గోడను కూడా చూడవచ్చు.రుద్రమదేవి కాలంలో అసమానంగా వెలుగొందిన ఈ కోట తరువాత రుద్రమదేవి మనుమడు రెండవ ప్రతాప రుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానాయకుడు మాలిక్ కపూర్ లక్ష సైన్యంతో ఈ కోటమీదకు దండెత్తి వచ్చాడు. ఈ ఆక్రమణలో కోట నాశనం చేయబడింది. తరువాత కూడా చాలాసార్లు ఢిల్లీ సుల్తానుల ఆక్రమణలకు ఈ కోట గురైంది. అక్కడనుండి దీని ప్రాభవం కోల్పోయింది.
ఎలా వెళ్లాలి ...?
చారిత్రాత్మకమైన ఈ ఓరుగల్లు కోట వరంగల్ రైల్వేస్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్ లలో లేక ఆటోలలో వెళ్లవచ్చు.

3.మక్కా మస్జిద్ 

భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా మరియు తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.

చార్మినారుకు నైరృతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగి ఉంది. ఈ మస్జిద్ లో మహమ్మదు ప్రవక్త యొక్క "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది

4.శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

5.వీరభద్రస్వామి దేవాలయం

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. 


ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు మరియు కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది.

6.గోల్కొండ కోట

గోల్కొండ కోట మరియు నగరము. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. 1336 A. D.లో ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో ముసునూరి కాపయ భూపతి గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను

మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది
 గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులు కు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయ కమ్మరాజులకు, వారి వారసులు ముసునూరి నాయకుల కు గోల్కొండరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో గుల్బర్గ్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు సంఘర్షణలు జరిగాయి.మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ భూపతి కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా వేలం పట్టణముపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు.గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపయ భూపతిపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపయ భూపతి ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ భూపతి షాతో సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు.

1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్తులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు..ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు.

7.చార్మినార్

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం. Charminar history నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.

ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్‌కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్‌ రూపొందిందో!

చార్మినార్చార్-మీనార్ అనగా నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. ఇది హైదరాబాదు పాత బస్తీలో ఉంది. ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టు ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతముగా గుర్తింపు వచ్చింది. దీనికి ఈశాన్యములో లాడ్ బజార్ మరియు పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మస్జిద్ ఉన్నాయి. చార్మినార్‌ పనులు పూర్తయిన మరుసటి యేడాది 1592లో చార్మినార్‌కు నాలుగు వైపులా చార్‌ కమాన్‌లు నిర్మించారు. చార్మినార్ కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో ఈ కమాన్‌లను నిర్మించారు.

Thanks for reading What are the seven wonders of Andhra Pradesh and Telangana?

No comments:

Post a Comment