Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 26, 2019

2 new credit cards from SBI, benefits, full details


SBI నుంచి 2 కొత్త క్రెడిట్ కార్డులు.. లాభాలెన్నో.. పూర్తి వివరాలు

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు తాజాగా రెండు కొత్త క్రెడిట్ కార్డులను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇవి కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు. అంటే మరో కంపెనీ భాగస్వా్మ్యంతో ఎస్‌బీఐ ఈ కార్డులను లాంచ్ చేసింది. ఆ కంపెనీ విస్తారా ఎయిర్‌లైన్స్. ఎస్‌బీఐ కార్డులో స్టేట్ బ్యాంక్‌కు ఏకంగా 74 శాతం వాటా ఉంది.

కొత్త క్రెడిట్ కార్డులు ఇవే
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు ప్రైమ్ అనేవి వీటి పేర్లు. కార్డు ప్రాతిపదికన బెనిఫిట్స్ కూడా మారతాయి. ఈ కార్డులు తీసుకోవడం వల్ల కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్/బేస్ టైర్ మెంబర్‌షిప్, వెల్‌కమ్ టికెట్స్, వన్ క్లాస్ అప్‌గ్రేడ్ వోచర్, విస్తారా బుకింగ్స్‌పై ఫ్రీ క్యాన్సలేషన్ వంటి ప్రయోజనాలు పొందొచ్చని విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది.

SBI నుంచి 2 కొత్త క్రెడిట్ కార్డులు.. లాభాలెన్నో.. పూర్తి వివరాలు


చార్జీలు ఇలా...
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు ప్రైమ్ పొందాలంటే కస్టమర్లు రూ.2,999 చెల్లించాలి. దీనికి GST అదనం. అలాగే ప్రతి ఏడాది కూడా రెన్యూవల్ కోసం ఇదే మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి. అదే క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు తీసుకోవాలని భావిస్తే రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కూడా జీఎస్‌టీ చార్జీలు అదనం. రెన్యూవల్‌కు కూడా ఇదే చార్జీలు వర్తి్స్తాయి. రెండింటిపై యాడ్ ఆన్ కార్డును ఉచితంగా పొందొచ్చు.
రివార్డు పాయింట్ల సంగతేంటి?
ప్రైమ్ కార్డు కలిగిన వారు విమాన టికెట్లను బుక్ చేసుకుంటే ప్రతి రూ.100కు 9 క్లబ్ విస్తారా పాయింట్లు పొందొచ్చు. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే వీరికి వార్షిక క్లబ్ విస్తారా సిల్వర్ టైర్ మెంబర్‌షిన్‌ను ఉచితంగా పొందొచ్చు. మైల్‌స్టోన్ స్పెండ్స్‌పై ఆకర్షణీయ రివార్డు పాయింట్లు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
విమాన టికెట్ ఫ్రీ
ప్రైమ్ కార్డు కలిగిన వారికి వెయిట్‌లిస్ట్ క్లియరెన్స్‌లో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ప్రీమియం ఎకానమీ కౌంటర్‌లో ఎయిర్‌పోర్ట్ చెకిన్, 5 కేజీల వరకు అదనపు చెకిన్ బ్యాగేజ్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే ఉచితంగా ఫ్లైట్ టికెట్ పొందొచ్చు. ఇది వెల్‌కమ్ గిఫ్ట్‌గా లభిస్తుంది. ఇది ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్. ప్రతి ఏడాది రెన్యూవల్‌పై ఇదే ప్రయోజనం ఉంటుంది.
టికెట్ క్యాన్సలేషన్‌పై నో చార్జీలు
సాధారణంగా ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకున్న తర్వాత దీన్ని రద్దు చేసుకుంటే.. చార్జీలు భారీగా పడతాయి. అయితే ప్రైమ్ కార్డు కలిగినవారికి ఎలాంటి దిగులు అవసరం లేదు. విస్తారా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా కంపెనీ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత వాటికి క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు పడవు. అయితే ఆరు సార్లు మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు తీసుకుంటే..
ప్రైమ్ కార్డు కాకుండా క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు తీసుకుంటే.. అప్పుడు ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై ప్రతి రూ.100కు 8 క్లబ్ విస్తారా పాయింట్లు లభిస్తాయి. అలాగే వీరికి కూడా ఫ్లైట్ టికెట్ క్యాన్సలేషన్‌పై ఎలాంటి చార్జీలు పడవు. అయితే పరిమితి మాత్రం 6 నుంచి 4కు తగ్గించారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉచితం
విస్తారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కలిగినవారు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా పొందొచ్చు. ప్రైమ్ కార్డు ఉన్న వారికి రూ.కోటి వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవర్ లభిస్తుంది. చెకిన్ బ్యాగేజ్ లాస్, చెకిన్ బ్యాగేజ్ ఆలస్యం, ట్రావెల్ డాక్యుమెంట్లు పోవడం వంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. క్లబ్ విస్తారా కార్డు తీసుకుంటే రూ.50 లక్షల వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవర్ లభిస్తుంది.

Thanks for reading 2 new credit cards from SBI, benefits, full details

No comments:

Post a Comment