Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 13, 2019

Ammavodi






  1. పథకం కింద లబ్ధి పొందనున్న విద్యార్థుల సంఖ్యపై స్పష్టత
  2. తెల్లరేషన్‌ కార్డు ఉండి 75 శాతం హాజరున్న వారంతా అర్హులే
  3. జిల్లాలోని విద్యా సంస్థల్లో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
  4. అమ్మఒడి @ 8.38 లక్షలు


Ammavadi

 జిల్లాలో అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందనున్న విద్యార్థుల సంఖ్యపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 8.38 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తొలుత ప్రకటించినట్లు జనవరి 26 నుంచే ఈ పథకం అమలు కానుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థికి ఏటా రూ.15,000 వంతున ప్రభుత్వం అందజేస్తుంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ పథకం అమలుకు జిల్లాకు సుమారు రూ.1,257.46 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతూ తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి విద్యార్థి ఈ పథకం కింద అర్హులవుతారు. ఆ విద్యార్థికి 75 శాతం హాజరు ఉండటం తప్పనిసరి. మధ్యలో చదువు  మానేస్తే ఈ పథకం కింద అనర్హులవుతారు. స్వచ్ఛంద సేవా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న అనాథ, వీధిబాలలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.ప్రాధమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న చైల్డ్‌ఇన్‌ఫోలో తప్పకుండా నమోదవ్వాలి. ఆధార్‌లో తప్పిదాలు, ఇతర కారణాల వల్ల కొందరు విద్యార్థుల వివరాలు ఇందులో నమోదు కాలేదు. ఈ సమస్య పరిష్కారంపై యంత్రాంగం ప్రస్తుతం దృష్టి సారించింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసే సమయంలో రేషన్‌ కార్డు, తల్లి/సంరక్షకుల బ్యాంకు ఖాతా నకలు జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.

Thanks for reading Ammavodi

No comments:

Post a Comment