Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 11, 2019

Guava Fruit Health benifit - థైరాయిడ్‌ను దూరం చేసే జామపండు ..


Guava Fruit Health  benifit - థైరాయిడ్‌ను దూరం చేసే జామపండు ..

Guava Fruit Health  benifit - థైరాయిడ్‌ను దూరం చేసే జామపండు ..

పండ్లు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని మనందరికీ తెలుసు. రకరకాల పండ్లు మనకు రకరకాల పోషకాలు అందిస్తాయి. అలాగే కొన్ని పండ్లు తినడం వల్ల రోగాలు కూడా నయం అవుతాయి. వాటిలో జామ పండు ఒకటి.

జామపండును రోజూ తీసుకోవటం వలన థైరాయిడ్‌ నుండి విముక్తి పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే విటమిన్-సి లోపించడం వలన వచ్చే వ్యాధులను జామకాయ తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు అని, అంతేకాకుండా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను జామకాయ దరిచేరనివ్వదు అని అంటున్నారు.


 జామలో చాలా శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది.


 జామపండులో విటమిన్-సితో పాటు విటమిన్-ఏ చాలా ఎక్కువ. జామను రోజుకొకటి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.


 జామపండులో ఉన్న విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల వలన మెదడు చురుగ్గా ఉంటుంది. ఈ విటమిన్స్ వలన మెదడులోని న్యూరాన్‌లు సమర్థవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..


 జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు..!


1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.


2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.


3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.


4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.


5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.


6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.


7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.


8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది.


9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.


10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.


11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.


జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.


 ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.


 గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.


  జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Thanks for reading Guava Fruit Health benifit - థైరాయిడ్‌ను దూరం చేసే జామపండు ..

No comments:

Post a Comment