How to get educational loans and how to get back it.
ఎడ్యుకేషన్ లోన్ ఎవరికి ఇస్తారు?ఎలా తీసుకోవాలి?తిరిగి ఎలా చెల్లించాలి?- AICTE, UGC, MHRD, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ గుర్తింపు ఉన్న ఇనిస్టిట్యూట్ లలో ప్రవేశం పొందిన విద్యార్థులకి మాత్రమే విద్యా ఋణం లభిస్తుంది.
- విద్యార్థులు అడ్మిన్ పొందిన విధానాన్ని కూడా బ్యాంక్ లు పరిగణనలోకి తీసుకుంటాయి.
- ఎంట్రన్స్ లలో ఉత్తీర్ణత సాధించి,మెరిట్ లిస్టులో ఉంటేనే రుణం మంజూరు చేస్తారు.
- మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందితే ఋణం ఇవ్వరు.ఒక్కోసారి బ్యాంక్ మేనేజర్ ఇష్టం.
- మన దేశం లో ప్రవేశం పొందితే గరిష్టంగా 10 లక్షలు ఇస్తున్నారు.
- విదేశీ ఇనిస్టిట్యూట్ లలో ప్రవేశం పొందితే గరిష్టంగా 20 లక్షలు మంజూరు చేస్తారు.
- రుణ మొత్తం ఆధారంగా కొన్ని హామీ పత్రాలు బ్యాంక్ లు తీసుకుంటున్నాయి
- 4 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు.
- 4 లక్షల నుండి 7.5 లక్షల వరకు తల్లిదండ్రులు హామీ,థర్డ్ పార్టీ గ్యారంటీ ఇవ్వాలి.
- 7.5 లక్షల కి మించిన ఋణానికి కొల్లేటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి.
- రుణ మొత్తం లో కొంత మార్జిన్ మనీ పేరుతో సొంతంగా సమకూర్చుకోవాలి.
- 4 లక్షల ఋణం వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు.
- 4 లక్షల పైన ఋణం తీసుకునే విద్యార్థులు స్వదేశంలో ఐతే 5%,విదేశాల్లో ఐతే 15% మార్జిన్ మనీని సమకూర్చుకోవాలి
- కోర్సు పూర్తి అయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం లభించినప్పటి నుండి వాయిదాల విధానంలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలి.
- గరిష్టంగా 15 ఏళ్ల వ్యవధిలో ఈఎంఐ విధానం లో చెల్లించవచ్చు.
- కోర్సు పూర్తి చేసుకొని స్టార్టప్ ఏర్పాటు చేసుకున్న విద్యార్థులు, కోర్సు పూర్తి ఐన తర్వాత రెండేళ్ల తర్వాత నుండి ఋణం తిరిగి చెల్లించేలా వీలు కల్పించారు.
- వడ్డీ రేట్లలో ముఖ్యంగా మహిళలుకి 0.5% నుండి 1% వరకు రాయితీలు ఇస్తున్నారు.
- IIM, IIT వంటి వంటి ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ లలో 10 లక్షల కంటే ఎక్కువగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో గరిష్ఠ ఋణం పెంచే అవకాశం ఉంది.
- మంజూరు ఐన విద్యా ఋణం బ్యాంకులు నేరుగా ఇనిస్టిట్యూట్ కే పంపుతాయి.
- ఒక వేళ తొలిసారిగా విద్యార్థులు ఫీజు కట్టి ఉంటే,రసీదులు ఆధారంగా కట్టిన ఫీజు విద్యార్థులు కి తిరిగి చెల్లించి తర్వాత దశ నుండి నేరుగా ఇనిస్టిట్యూట్ కే పంపుతాయి.
- ఋణం మొత్తం ప్రతి ఏటా అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఇనిస్టిట్యూట్ కి పంపుతాయి,
- ఐతే విద్యార్థులు ప్రతిభను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.చదువులో విద్యార్థులు ప్రతిభ సంతృప్తికరంగా ఉంటేనే మిగతా ఋణం మంజూరు చేస్తారు.
కావలసిన ధ్రువ పత్రాలు
- ప్రవేశ దృవీకరణ పత్రం
- అర్హతల సెర్టిఫికెట్లు
- తలిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ
- తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతులు
- బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
- నివాస ధ్రువీకరణ
- థర్డ్ పార్టీ ఆదాయ ధ్రువీకరణ
- కోర్సు వ్యయానికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ల నుంచి అధీకృత లెటర్లు
Thanks for reading How to get educational loans and how to get back it.
No comments:
Post a Comment