Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, November 2, 2019

Naadu-nedu






Naadu-nedu
నాడు నేడు కార్యక్రమం పాఠశాలలో సమర్థవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పథకం కింద ప్రభుత్వం కొన్ని పాఠశాల నుండి ఇప్పటికే STMS యాప్ ద్వారా మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఎంపిక చేశారు ఈ పాఠశాల అభివృద్ధికి మార్చి 15వ తేదీ లోపు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చేస్తారు విధివిధానాలు ఏంటి అనేది ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ఆధారంగా మీ అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము


కార్యక్రమం ఎలా అమలు చేస్తారు?


  1. ముందుగా ఈ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి  
  2. ఈ కమిటీ కి మాత్రమే పాఠశాల అభివృద్ధి పనులు అప్పగించాలి కాంట్రాక్టర్లకు వేరే వారికి ఎట్టి పరిస్థితులలోను అప్పగించురాదు 
  3. పేరెంట్స్ కమిటీ నుండి ఐదుగురు సభ్యలు ఎంపిక చేసుకోవాలి ఎన్నిక  ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉండే విధంగా చూడాలి
  4.  సమగ్ర శిక్ష అభియాన్ నుండి సైట్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా సభ్యులుగా ఉంటారు  
  5. ఎంపిక చేసిన పాఠశాలను సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్ వచ్చి ఈ కమిటీ తో సమావేశం  అయ్యి పాఠశాలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఎస్టిమేషన్ రూపొందిస్తారు 
  6. ఎస్టిమేషన్ రూపొందించిన తర్వాత ఆన్లైన్లో ఎస్టిమేషన్ అప్లోడ్ చేస్తారు ఒకసారి అప్లోడ్ చేసిన ఎస్టిమేషన్ మార్చడానికి సాధ్యం కాదు అందుకని ప్రధానోపాధ్యాయులు తమకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ముందుగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది
  7.  ఈ కమిటీ నీ పనులు చేయడానికి వారు ఖర్చు చేసే పనికి  ముందుగానే కొటేషన్ తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ ఛానల్ పిడి ఎకౌంట్స్ ద్వారా సంబంధిత షాపులకు ఈ అమౌంట్ వారి ఖాతాలో జమ చేయబడుతుంది 
  8. అమౌంట్ పడిన తర్వాత వారి దగ్గర నుండి జిఎస్టి బిల్లు తీసుకోవాలి ఈ బిల్లులు పూర్తి చేయడానికి ఎంపిక చేసిన పాఠశాలలో నెలకు రెండు వేలు ఇచ్చి ఒక వ్యక్తి నియమిస్తారు ఆయనే ఈ బిల్లులు వ్యవహారాలను చూసుకుంటారు
  9.  ఈ పాఠశాల అభివృద్ధి అంతా మార్చి 15వ తేదీ లోపు పూర్తి అవ్వాలి 
  10. జిల్లాలో 13 మంది సభ్యులతో ఒకటి ఉంటుంది ఈ కమిటీ పనులు పర్యవేక్షిస్తుంది

పాఠశాలలో ఏర్పాటు చేసి సౌకర్యాలు

ఒక రూమ్ కు నాలుగు ఫ్యాన్ లు 20 ఓల్డ్ కలిగిన 4 ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేస్తారు వైరింగ్ కూడా చేస్తారు అలాగే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తారు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తారు టాయిలెట్ అవసరమైతే  నిర్మాణం చేస్తారు ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతి గదిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక తరగతి గదిని ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతి గదిని అభివృద్ధి చేస్తారు 40 మంది విద్యార్థులు ఒక టాయిలెట్ నిర్మాణం చేస్తారు 20 మందికి ఒక Urinals ఏర్పాటు చేస్తారు

ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?


నవంబర్ 14వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రెండో విడత ఈ కార్యక్రమం జూన్ నెలలో ప్రారంభం అవుతుంది

గమనిక: వివిధ వనరుల నుండి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది అదే ప్రామాణికం కాదు ఇంకా అధికారిక ఉత్తర్వులు విడుదల  కావాలి

Thanks for reading Naadu-nedu

No comments:

Post a Comment