ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యంశాలు

అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించినారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైనా చర్చలు జరిపారు.
2.మరోవైపు రైతు బీమా కార్పొరేషన్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తదితర 22 అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
1.మరోవైపు మహిళలపై లైంగిక దాడి చేసే నిందితులకు త్వరితగతిన శిక్ష పడే అంశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లో మార్పులు చేసి మహిళా భద్రత బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో కఠినచట్టం తీసుకొస్తామని సీఎం జగన్ ఇప్పటికే శాసనసభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళలపై లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా మహిళా భద్రత బిల్లు ముసాయిదాను ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లుకు బుధవారం జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది..
2.మరోవైపు రైతు బీమా కార్పొరేషన్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తదితర 22 అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
3.మంగళగిరిపై ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మంగళగిరి పరిధి ఫస్ట్ గ్రేడ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
4.ప్రభుత్వం లో కొత్తగా ప్రజా రవాణా శాఖఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రజా రవాణా శాఖ కింద చేర్చుతూ కేబినెట్ ఆమోదం
5.ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పని సరి చేస్తూ కేబినెట్ నిర్ణయం
6.కాపు ఉద్యమ కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం
Thanks for reading AP Cabinet Meeting Highlights 11-12-2019
No comments:
Post a Comment