Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 26, 2019

AP Cabinet meeting tomorrow i.e 27.12.19 at 11 am


క్యాబినెట్ భేటీ - ఎజెండా అంశాలు ఇవే...

AP Cabinet meeting tomorrow at 11 am

 రేపు 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ

  అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. రేపటి సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత సచివాలయంలోనే మంత్రివర్గం భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ.. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తారా? లేదా సచివాలయంలోనే నిర్వహిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రివర్గ భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చించి, దానిని ఆమోదించే అవకాశముంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్‌ ప్లాట్ల అంశంపై చర్చించే అవకాశముంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపైనా చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాల సేకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే  యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్‌ ఏర్పాటుపై చర్చించనున్నారు. పంటలకు మద్దతు ధర, ఏపీఐసీసీ ద్వారా వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశముంది. సీఆర్డీయేలో ఐఏఎస్‌లు కొన్న ప్లాట్లకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపైనా చర్చించనున్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం కృషి: వైకాపా




    అమరావతి: కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు కె.పార్థసారధి, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, తదితరులు మీడియాతో మాట్లాడారు.‘‘  రాజధాని నిర్మాణం అంటే కొత్త పట్టణాలు కాదని మా అభిప్రాయం. లు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని కోసం రూ. లక్షా 10వేల కోట్లు  అవసరం. అన్ని  నిధులు ఖర్చు చేయగలమా? రాజధానిపై పెట్టుబడి తగ్గించి.. రైతులకు ఎక్కువ సాయం చేస్తున్నారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. తాత్కాలిక రాజధానిపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. తాత్కాలిక రాజధానిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఆలోచిస్తున్నాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగదు. ఏ కులం మీదో, ప్రాంతం మీదో మా ప్రభుత్వానికి కక్ష లేదు. సీఎంకు స్వార్థం ఉంటే రాజధానిని రాయలసీమకో, దొనకొండకో తీసుకెళ్లేవారు.

 13 జిల్లాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ సీఎం ముందుకెళ్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి ఏమాత్రం కుంటుపడదు. రాజధాని ఎక్కడున్నా.. అన్ని ప్రాంతాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం. ప్లాట్లు, కౌలు, అసైన్డ్‌ భూముల విషయంలో రైతులకు అండగా ఉంటాం. రూ.లక్ష కోట్లు అప్పు చేసి ఒకే చోట ఖర్చు చేయాలా అనేదానిపై చర్చించాం. రైతులు ఇచ్చిన 33వేల ఎకరాల్లో నగరం నిర్మించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం  ఆలోచిస్తోంది. అమరావతిలో అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. విద్య, మౌలిక వసతులపై ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే యోచనలో సీఎం ఉన్నారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలంతా స్వాగతిస్తున్నాం’’ అని వైకాపా ఎమ్మెల్యేలు  తెలిపారు

Thanks for reading AP Cabinet meeting tomorrow i.e 27.12.19 at 11 am

No comments:

Post a Comment