Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 12, 2019

DSC in January


జనవరిలో డీఎస్సీ
విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్  వెల్లడి
 జనవరిలో డీఎస్సీ వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ఈ మేరకు ఇంతకు ముందు పలు వేదికలపైనా ప్రకటించామని విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ శాసనమండలి లో వివరిం చారు. ఎమ్మెల్సీలు గోవింద రెడ్డి, రామకృష్ణారెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వర రావు, శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు డీఎస్సీ, ఉపాధ్యాయ భాళీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు కనీసం 25 వేల పోస్టులతో
మెగా డీఎస్పీ వేయాలని కోరగా.. పాఠశాలల
న్నింటిలో ఖాళీలను భర్తీ చేసేలా డీఎస్సీ వేయాలనుకుం టున్నామని, దాన్ని మెగా డీఎస్సీ అనుకుంటే అభ్యంతరం లేదని మంత్రి వివరించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. 1998, 2008, 2012 డీఎస్సీలో నష్టపరోయిన అభ్యర్థుల కోసం వేసిన కమిటీ ఏమైందని, వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వచ్చే ఏడాది మార్చి నాటికి రిటైరయ్యే ఉపాధ్యాయుల సంఖ్యను కూడా తీసుకుని ఆ మేరకు డీఎస్పీ వేయాలని పలువురు
ఎమ్మెల్సీలు కోరగా.. అలా చేయడం సాధ్యం కాదని మంత్రి బదులిచ్చారు. 2013 సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియ ఆలస్యమైందని, డీఎస్సీకి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు, విద్యావ్యవస్థను
బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఖాళీల భర్తీ చేపడతామని మంత్రి డా.సురేష్ వివరించారు. పాఠశాలల రూపు మార్చేందుకు
ప్రజాప్రతినిధులు కృషి చేయాలి రాష్ట్రంలో పాఠశాల రూపు మార్చేందుకు ప్రజాప్రతినిధులంతా నడుం బిగించాలని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి  డాక్టర్ఆ దిమూలపుసురేష్ పిలుపునిచ్చారు. నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని, కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులు
ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు
ఇవ్వాలని కోరారు. గురువారం సచివాలయం
లోని 5వ బ్లాక్ లో పలువురు మంత్రులు తూర్పుగోదావని, శ్రీకాకుళం, విజయనగరం
విశాఖపట్నం జిల్లాల ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ విద్యావ్యవస్థలో తీసుకుంటున్న సంస్కరణలతో  మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నాడు- నేడును ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్మాణ కమిటీల ద్వారా జరుగుతుందన్నారు. బిల్లులు చెల్లింపు కోసం
చెక్ లపై ఫీల్డ్ ఇంజనీర్, ప్రధానోపాధ్యాయులుతో పాటు పేరెంట్స్క మిటీలోని ముగ్గురు సభ్యులను బాద్యులుగా చేస్తున్నామని వివరించారు. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎక్కువ
మందిని భాగ్యస్వాములుగా చేయటం వల్ల పనుల్లో అవాంతరాలు  ఏర్పడతాయని సూచించారు
దీనిపై మంత్రి మాట్లాడుతూ చెక్కుపై ఎక్కవమంది
సంతకాలు ఉండటం ఇబ్బంది అయితే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి రూపాయికి లెక్క చూపే విధంగా పేరెంట్స్ కమిటీ రిజిస్టర్ మెయింటైన్ చేయాల న్నారు కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు ఉపాధిహామీ నిధుల తో అంచనాలు
రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

Thanks for reading DSC in January

No comments:

Post a Comment