Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 29, 2019

Is the house or land going to be sold? How to re-invest the proceeds from the sale would be exempt from the long-term capital gains tax.


Is the house or land going to be sold? How to re-invest the proceeds from the sale would be exempt from the long-term capital gains tax.
Is the house or land going to be sold? How to re-invest the proceeds from the sale would be exempt from the long-term capital gains tax.

  ఇల్లు లేదా భూమి విక్రయించబోతున్నారా? అలా విక్రయించగా వచ్చిన మొత్తాన్ని మళ్లీ స్థిరాస్తి కొనుగోలుపై ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. లేదంటే పన్ను రూపంలో భారీ మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది.

లేదంటే పన్ను వాయింపు

  ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రాపర్టీ రూపంలో ఇళ్లు కొనుగోలు చేసే వారికి పెద్ద ఊరట నిచ్చింది. రెండేళ్లపాటు తమ యాజమాన్యంలో ఉన్న ఇల్లు లేదా భూమి విక్రయించినట్టయితే ఆ మొత్తాన్ని తిరిగి కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు కోసం ఇన్వెస్ట్‌ చేసినట్టయితే రూ.2 కోట్ల గరిష్ఠ పరిమితి వరకు దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ ఆస్తిపై మీకు చేకూరిన లాభం రెండు కోట్లు దాటితే మాత్రం దానిపై ఎల్‌టీసీజీ చెల్లించి తీరాల్సిందే. మీరు చెల్లించాల్సిన పన్ను ఆస్తి విక్రయం ద్వారా మీరు ఆర్జించిన లాభం ఎంత ఉంటే దానిపై 20 శాతం ఉంటుంది. ఉదాహరణకు రూ.50 లక్షల మేరకు ఆస్తిపై మీకు లాభం సమకూరిందంటే రూ.10 లక్షలు పన్నుగా చెల్లించాల్సిందే. ఆదాయపు పన్ను చట్టంలోని 54, 54ఎఫ్‌ సెక్షన్ల కింద ఈ మినహాయింపు పొందవచ్చు.

ఎంత రీ ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది?

   పాత ఇల్లు విక్రయించగా వచ్చిన సొమ్ము నుంచి పూర్తి లాభం పొందాలంటే ఎంత మొత్తం రీ ఇన్వెస్ట్‌ చేయాలనేది ఎవరికైనా సందిగ్ధమే. అలాగే ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ము మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలా లేక దానిపై వచ్చిన లాభం మాత్రం ఇన్వెస్ట్‌ చేస్తే చాలునా అని చాలా మంది బంధుమిత్రుల సలహా అడుగుతూ ఉంటారు. ఐటీ చట్టం సెక్షన్‌ 54 ప్రకారం ఎవరి చేతిలో అయినా ప్రాపర్టీ రెండేళ్లకు పైబడి ఉన్నట్టయితే కొనుగోలు చేసిన రోజు నుంచి విక్రయించిన రోజు నాటికి ఎంత లాభం పొందితే ఆ మొత్తాన్ని మాత్రం రీ ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. రీ ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం లేదా కొత్త ఆస్తి కొనుగోలు వ్యయం రెండింటిలో ఏది తక్కువ మొత్తం ఉంటే దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తించే ప్రయోజనం. పదేపదే ఇళ్లు అమ్మి, కొనుగోలు చేసి ప్రతి సందర్భంలోనూ ఎల్‌టీసీజీ మినహాయింపు పొందుతామంటే చెల్లదు. అందుకే ఈ ప్రయోజనం తీసుకోవాలా, వద్దా అనే విషయం జాగ్రత్తగా మదింపు చేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి లాభాల గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలుగా ప్రకటించారు.

రెండు ప్రాపర్టీల కొనుగోలుకు అవకాశం

  గతంలో ఎల్‌టీసీజీ సొమ్ముతో ఒక్క కొత్త ప్రాపర్టీ మాత్రమే కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది. కాని 2019 బడ్జెట్‌ ఆ సొమ్ముతో రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇల్లు నేరుగా కొనుగోలు చేసినా లేదంటే కొత్త ఇల్లు నిర్మించుకున్నా రెండింటికీ ఆ ప్రయోజనం అందుతుంది.

రెండేళ్లలోగా అమ్మితే లాభం వెనక్కి...

  కొత్తగా సమకూర్చుకున్న ప్రాపర్టీ కొనుగోలు తేదీ నుంచి రెండేళ్లలోగా తిరిగి అమ్మేసుకుంటే మాత్రం 54ఎఫ్‌ సెక్షన్‌ కింద పొందిన మినహాయింపు రద్దవుతుంది. అదే జరిగితే మినహాయింపు పొందిన పెట్టుబడి లాభాల పన్ను ఎంతైతే అంత మొత్తాన్ని ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

కాలపరిమితి ఎంత?

  ప్రాపర్టీ విక్రయించిన తేదీ నుంచి రెండేళ్ల లోగా మాత్రమే కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే 54 ఎఫ్‌ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రాపర్టీ విక్రయించడానికి ఒక ఏడాది ముందు ఏదైనా మరో ప్రాపర్టీ కొనుగోలు చేసి ఉంటే దానిపై కూడా పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దాన్ని పెట్టుబడి లాభాల రీ ఇన్వె్‌స్టమెంట్‌గా చూపించాల్సి ఉంటుంది. రెడీగా అందుబాటులో ఇల్లు కొనుగోలు చేయడానికి బదులు ఇల్లు కట్టుకుంటున్నా, నిర్మాణంలో ఉన్న ఇల్లు కొన్నా రీ ఇన్వె్‌స్టమెంట్‌కు మరికొంత గడువు అదనంగా లభిస్తుంది. నిర్మాణం మూడు సంవత్సరాల లోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో చిక్కుముడి కూడా ఉంది. పాత ప్రాపర్టీ విక్రయం లేదా బదిలీ తేదీ నాటికి ఆ ప్రాపర్టీ మినహా మీరు మరో ప్రాపర్టీ యజమాని అయి ఉండకూడదు. అలాగైతే ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు వర్తించదు.

గడువు తక్కువ ఉంటే ఏం చేయాలి?
  పెట్టుబడి లాభాలతో కొత్త ప్రాపర్టీ కొనుగోలుకు గడువు తక్కువ ఉంటే ఏం చేయాలనేది మరో ప్రశ్న. ఉదాహరణకు మార్చిలో మీరు ఇల్లు అమ్ముతున్నారనుకుంటే జూలై చివరి లోగా ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే అమ్మిన తేదీకి, కొత్త ప్రాపర్టీ కొనుగోలు డెడ్‌లైన్‌ ముగియడానికి 4 నెలలే గడువు ఉంటుంది. అప్పుడు పెట్టుబడి లాభంగా వచ్చిన సొమ్మును కేపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ కింద బ్యాంకు లో ఖాతా తెరిచి అందులో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఐటీ రిటర్న్‌లో ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

Thanks for reading Is the house or land going to be sold? How to re-invest the proceeds from the sale would be exempt from the long-term capital gains tax.

No comments:

Post a Comment