Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 24, 2019

Job in TCS with a General Degree


Job in TCS with a General Degree

Job in TCS with a General Degree

The announcement was made for the National Qualifier Test.

సాధారణ డిగ్రీతో టీసీఎస్‌లో ఉద్యోగం!
నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు ప్రకటన విడుదల
సాధారణ డిగ్రీతో టీసీఎస్‌లో ఉద్యోగం!

ఈ విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థులకు టీసీఎస్‌లో ఉద్యోగం అందుకునే అవకాశం వచ్చింది. ఇందుకోసం జాతీయ అర్హత పరీక్ష జరగనుంది. ఎంపికైనవారికి కాగ్నిటివ్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ (సీబీఓ), బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ అందించి శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు!
టీసీఎస్‌ జాతీయ అర్హత పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి 50 నిమిషాల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. వెర్బల్‌ ఎబిలిటీలో 10 ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌- 4, లాజికల్‌ రీజనింగ్‌- 12, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- 12, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌- 12 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల వ్యాకరణంలో ప్రాథమిక పరిజ్ఞానం, వాక్యనిర్మాణం పరిశీలించే ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి తర్కం, విశ్లేషణ నైపుణ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైతే మే 2020 నుంచి టీసీఎస్‌లో విధుల్లోకి తీసుకుంటారు. నమూనా పరీక్షను టీసీఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దాని పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి, ఏ అంశాలు చదవాలో తెలుస్తుంది.

ఎవరి కోసం

2019-20 విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. విద్యాభ్యాసం మొత్తంలో రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదు. పెండింగ్‌ బ్యాక్‌లాగ్స్‌ ఉండకూడదు. 10, 12, డిగ్రీ కోర్సులు తొలి ప్రయత్నంలోనే పూర్తిచేసి ఉండాలి. ఈ కోర్సులు పూర్తిచేయడానికి అదనపు విద్యా సంవత్సరాలు వెచ్చించినవాళ్లు అనర్హులు.

సాధారణ డిగ్రీతో టీసీఎస్‌లో ఉద్యోగం!

ఎంపికైతే...

ఎంపికైనవారు బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ట్రావెల్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, ప్రి సేల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌, మీడియా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌, టెలికాం...తదితర విభాగాల్లో సేవలందిస్తారు. సంస్థ ప్రస్తుత అవసరాలు, అభ్యర్థి నైపుణ్యాల ప్రకారం వీటిలో ఏదైనా విభాగాన్ని కేటాయిస్తారు. అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ప్రకారం పలు రకాల డొమైన్‌లు, ప్రాంతాల్లో సేవలు అందించాలి. షిఫ్ట్‌ల్లో పనిచేయడానికి సిద్ధపడాలి. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించేవారికి ఇంటి వరకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. మెడికల్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పలు ఇతర సౌకర్యాలు లభిస్తాయి.


రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జనవరి 5 పరీక్ష తేదీలు: జనవరి 18, 25 - 2020

వెబ్‌సైట్‌: www.tcs.com/careers

Thanks for reading Job in TCS with a General Degree

No comments:

Post a Comment