Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 11, 2019

LIC: Link a bank account to your LIC policy


LIC: Link a bank account to your LIC policy

LIC: Link a bank account to your LIC policy

LIC : మీ ఎల్‌ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి ఇలా
LIC: Link a bank account to your LIC policy

మీ అకౌంట్ నెంబర్ ఎల్‌ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు . లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు .

మీరు మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్‌ని లింక్ చేశారా? బ్యాంక్ అకౌంట్‌ను ఎల్ఐసీతో లింక్ చేయకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. గతంలో ఎల్ఐసీ చెక్కు ద్వారా పాలసీ హోల్డర్లకు డబ్బులు చెల్లించేది. కానీ ఇటీవల నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. కాబట్టి మీ ఎల్ఐసీ పాలసీకి మీ బ్యాంకు అకౌంట్‌ను లింక్ చేయడం తప్పనిసరి. మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు. లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు. అందుకే ముందే మీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికీ చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్లను ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయలేదు. ఎల్ఐసీ పాలసీ తీసుకున్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు మీ ఏజెంట్‌కు ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్‌గా లేకపోతే, కొత్త అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయించాలి.
ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి?
ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం పెద్ద సమస్యేమీ కాదు. చాలా సులువైన ప్రాసెస్. ఇందుకోసం మీరు మీ క్యాన్సల్డ్ చెక్ లేదా మీ బ్యాంకు పాస్‌బుక్ ఫ్రంట్ పేజీని దగ్గర్లో ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్‌లో ఇవ్వాలి. NEFT ఫామ్ ఫిల్ చేయడం తప్పనిసరి. NEFT ఫామ్‌కు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ లేదా క్యాన్సల్డ్ చెక్ జతచేయాలి. వారం రోజుల్లో మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఎల్ఐసీ నుంచి రావాల్సిన ప్రతీ రూపాయి బ్యాంకు అకౌంట్‌లోనే జమ అవుతుంది.
ఎల్ఐసీ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్
కేవలం బ్యాంకు అకౌంట్ మాత్రమే కాదు మీ ఫోన్ నెంబర్‌ను కూడా పాలసీకి లింక్ చేయడం మంచిది. ఎందుకంటే మార్చి 1 నుంచి పాలసీ హోల్టర్లకు ప్రీమియం గడువు, చెల్లింపులు, పాలసీ ల్యాప్స్, బోనస్ లాంటి సమాచారం ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. మీ పాలసీకి ఫోన్ నెంబర్ లింక్ చేయకపోతే ఎల్ఐసీ నుంచి మీ పాలసీకి సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందవు. మీరు మీ ఫోన్ నెంబర్‌ను ఎల్ఐసీలో అప్‌డేట్ చేయించాలంటే మీ ఏజెంట్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. మీ మొబైల్ నెంబర్ మారినా ఎల్ఐసీకి సమాచారమివ్వాలి. మీరు ఆన్‌లైన్‌లో కూడా మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. లేదా 022-68276827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

Thanks for reading LIC: Link a bank account to your LIC policy

No comments:

Post a Comment