Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 21, 2019

Prakasam District Education Department Action Plan to increase passing percentage


Prakasam District Education Department Action Plan to increase passing percentage

  1. 10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం
  2. ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ యాక్షన్ ప్లాన్
  3. మరో వారం రోజుల్లో సిలబస్ పూర్తి
  4. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ
  5. ప్రతి రోజు గ్రాండ్ టెస్ట్లు :
  6. డీఈవో సుబ్బారావు గారు
   
Prakasam District Education Department Action Plan to increase passing percentage

    "జిల్లాలోని 956 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి రోజు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నాం. ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే జనవరి 1 నుంచి రెండు నెలల
పాటు అదనపు తరగతులు నిర్వహించడానికి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేయడం జరిగింది. ఈసారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకబహుమతులు అందజేయడానికి ఆలోచిస్తున్నాం"......DEO గారు

      త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతే ధ్వేయంగా జిల్లావిద్యాశాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఫలితాలలో జల్లానురాష్ట్రంలోనే ప్రథమస్నానంలో నిలిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఈ నెలాఖరు నాటికి సిలబస్ పూర్తిచేసి రివిజన్, గ్రాండ్ టెస్ట్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పాటు చదువులో వెనుకబడినవిద్యార్థులను గుర్తించి వారిని మెరుగుపరిచే బాధ్యతను
ఆయాసజ్జెక్ట్ల ఉపాధ్యాయులకు ఆప్పగించింది. జిల్లాలో మొత్తం 956 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి
వీటిలో 44,224 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. గత ఏడాది 42 వేల మంది విద్యార్థులు పరీక్షలురాయగా 97.17 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈసారి ఇంకా మెరుగైన ఫలితాలనుసాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. కేజీబీవీ,ప్రభుత్వ ఉన్నత, జెడ్పీ పాఠశాలల్లో జనవరి 1 నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహించనున్నారు. డిసెంబర్ 31 నాటికి మొత్తం సిలబస్ ను పూర్తిచేసి రివిజన్ చేపట్టనున్నారు. 10వ తరగతిలో బాగా వెనుకబడిన, కొంత మధ్యస్తంగా ఉన్న ,మంచి ఫలితాలు సాధించే విద్యార్థులను ఎ, బి, సిగ్రూపులుగా విభజించారు. అందులో సి గ్రూప్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఫలితాలు రాబట్టేలా జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు గారు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

ఉత్తీర్ణత మెరుగు పరచడానికి ప్రత్యేక ప్రణాళిక


      10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం
మెరుగుపరచడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దీనిని కఠినంగా అమలు చేస్తున్నారు. డీఈవో పర్యవేక్షణలో ఈ నెల 31 నాటికి సిలబస్ పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. ప్రత్యేక అధికారులు పాఠశాలల్లో జరుగుతున్న విద్యాబోధన, సిలబస్, ప్రాజెక్ట్ నివేదికను పరిశీలించి ఉన్నతాధి కారులకు నివేదిక సమర్పించనున్నారు. సిలబస్పూర్తయ్యే విధంగా సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఫలితాల సాధనే ధ్వేయంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచే తరగతులు ప్రారంభిస్తున్నారు.సాయంత్రం కూడా 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు అదనపు తరగతులు కొనసాగిస్తున్నారు. ప్రతి వారం గ్రాండ్
టెస్ట్లు నిర్వహించి ప్రీఫైనల్ పరీక్షలకు విద్యార్థులను
మానసికంగా సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా సి క్యాటగిరిలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో పాటు తరగతిలో వెనుకబడిన విద్యారులను కొంతమంది ఉపాధ్యాయులు దత్తత తీసుకొని బోధిస్తున్నారు. గ్రాండ్ టెస్ట్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడానికి విద్యాశాఖ ఆలోచిస్తుంది. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రత్యేక
తరగతులు నిర్వహిస్తున్నందున వంద శాతం ఫలితాల సాధనకు కొంతవరకు ఉపయోగపడు తుందని మేధావి వర్గాలు చెబుతున్నారు. రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన ప్రకాశం జిల్లా ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కసరత్తు పూర్తిస్థాయిలో చేపడుతున్నారు. డీఈవో ఉత్తీర్ణతలో వెనుకబడిన కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి చదువుపై శ్రద్ధచూపే విధంగా వారి ఆలోచనకు పదును పెడుతున్నారు. ప్రధానంగా ఎవరెవరు ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు, దీనికి గల కారణాలు విశ్లేషించి అందుకు తగిన విధం
గా ఆయాసబ్జెక్ట్ల ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.గత ఏడాది ఫలితాల కంటే 100 శాతం ఫలితాలు ఖచ్చితంగా వచ్చే విధంగా జిల్లా విద్యాశాఖ రాత్రింబవళ్లు కృషి చేస్తుంది

మార్చి 23 నుంచి టెన్త్ పరీక్షలు


    2020 మార్చి 23 నుంచి 10వ తరగతి పరీక్షలు
ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. దీనికోసం జిల్లా విద్యాశాఖ 190 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసింది. కేంద్రాల్లో డెస్క్లు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీటివసతి, మరుగుదొడ్లు ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.  పరీక్షా కేంద్రాలను డీఈవో సుబ్బారావు గారు   రెండు సార్లు పరిశీలించారు
కొన్ని కేంద్రాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.2017-18లో 94శాతం  , 2018-19లో
97.17 శాతం మంది  ఉత్తీర్ణులయ్యారు. దీంతో సంతృప్తి చెందని విద్యాశాఖ ఈసారి ఎలాగైనా 100
శాతం ఉత్తీర్ణత సాధించి తీరాలనే కృతనిశ్చయంతో
ఉంది.

Thanks for reading Prakasam District Education Department Action Plan to increase passing percentage

No comments:

Post a Comment