Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 23, 2019

SBI Yono Cash facility


 SBI Yono Cash facility


ATM: ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నా ఛార్జీలు పడవు... ట్రై చేయండి ఇలా


 ఏటీఎంలో మనకు ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే. ఏ బ్యాంక్ అయినా ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ ఛార్జీలు లేకుండా ఎన్నిసార్లైనా డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.
  ఏటీఎం ఛార్జీలు... ఈ మాట వింటే సామాన్యుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ఎంతెంత ఛార్జీలు పడతాయో అని ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉంటారు
  బ్యాంకు ఇచ్చిన పరిమితికి మించి ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించక తప్పదు. ఏ బ్యాంక్ అయినా ఈ ఛార్జీలు వసూలు చేయడంలో తక్కువేమీ కాదు. అన్ని బ్యాంకులూ కస్టమర్ల దగ్గర ఏటీఎం ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటాయి
   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ అందిస్తున్న సరికొత్త సదుపాయం ఇది. కేవలం ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం. మరి ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయడం ఎలాగో తెలుసుకోండి.
 మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే మీరు యోనో క్యాష్ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఎన్నిసార్లైనా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అదనంగా ఛార్జీలేవీ చెల్లించాల్సిన అవసరం లేదు.
మీరు కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌లోకి మారాలని కోరుతోంది ఎస్‌బీఐ. అంటే ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం అన్నమాట. మీ కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్‌ని మీరు ఎన్ని సార్లైనా చేసే అవకాశం కల్పిస్తోంది ఎస్‌బీఐ.


ఎస్‌బీఐ యోనో యాప్‌తో ఇది సాధ్యం. మీరు యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. యాప్‌కు 6 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత యోనో క్యాష్ పైన క్లిక్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
ప్రస్తుతం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు ఎలాంటి ఛార్జీలు లేవు. రోజుకు రూ.20,000 వరకు డ్రా చేయొచ్చు. ఒక ట్రాన్సాక్షన్‌లో ఒకేసారి రూ.10,000 డ్రా చేయొచ్చు. మీరు యోనో క్యాష్ ద్వారా డబ్బులు డ్రా చేయాలనుకుంటే మాత్రం మీకు దగ్గర్లో యోనో క్యాష్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి.

Thanks for reading SBI Yono Cash facility

No comments:

Post a Comment