Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 25, 2019

Solar eclipse tomorrow .. Follow these precautions ..!


రేపు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ జాగ్రత్తలు పాటించండి..!


  సూర్యుడు, భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. ఇక ఈ సంవత్సరం 26వ తేదిన సంపూర్ణ గ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.09ని.లకు గ్రహణం ప్రారంభం అయ్యి ఉదయం గం.11.11ని.లకు ముగుస్తుంది. మొత్తం మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశం అంతటా ఈ గ్రహణం కనిపించనుంది. అయితే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాల్లో ఉండనుండగా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. అలాగే శ్రీలంక, కొన్ని గల్ఫ్ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్‌లోనూ గ్రహణం ఎఫెక్ట్ కనిపించనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. అయితే ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం దేవాలయం తెరచి ఉంచబడుతుంది. గ్రహణం ఎఫెక్ట్‌ అక్కడి దేవాలయంపై ఉండక పోగా.. ఆ రోజున అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
   ఇదిలా ఉంటే సాధారణంగా  గ్రహణాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడటం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ముఖ్యంగా సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని వారు చెబుతుంటారు. అలాగే రెగ్యులర్ సన్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని వారు సూచిస్తుంటారు.
సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం సురక్షితం కాదని మనందరికీ తెలుసు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూస్తే బయటి పొరను కాల్చివేస్తాయి మరియు రెటీనాలోని కాంతి-సున్నితమైన కణాలను దెబ్బతీస్తాయి.
నాసా సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు అనుసరించాల్సిన క్రింది చిట్కాలను అందిస్తుంది:
- సూర్యుడిని నేరుగా చూడవద్దు.

- సూర్యుడిని చూడటానికి సౌర ఫిల్టర్లు లేదా ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించండి.
- అద్దాలు ISO ప్రమాణానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి.
- మూడు సంవత్సరాల కంటే పాత  అద్దాలు ఉపయోగించవద్దు.
- ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లు మరియు సాధారణ అద్దాలను ఉపయోగించవద్దు.
- ఫిల్టర్ చేయని కెమెరా, టెలిస్కోప్ లేదా బైనాక్యులర్లను ఉపయోగించవద్దు. ఈ అంశాలు సూర్యరశ్మిని పెద్దవి చేస్తాయి మరియు రెటీనాను కూడా త్వరగా దెబ్బతీస్తాయి.
రాశులపై ఎఫెక్ట్:
    కాగా 16ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ గ్రహణం కొన్ని రాశుల వారిపై ఎఫెక్ట్ చూపనుంది. ధనస్సు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది. అలాగే అష్టమ స్థానంలోనూ, అర్ధాష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి.. వృషభ రాశి, కన్యా రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిగిలిన రాశుల వారిని ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని వారు పేర్కొంటున్నారు.


More details...



Thanks for reading Solar eclipse tomorrow .. Follow these precautions ..!

No comments:

Post a Comment