Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 15, 2019

Tax time just Ahead - తగ్గించుకుందాం పన్ను భారం


Tax time just Ahead -  తగ్గించుకుందాం పన్ను భారం

   ఆదాయపు పన్ను చట్టం నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించక తప్పదు. ఈ భారం తగ్గించుకునేందుకూ చట్ట ప్రకారం కొన్ని మార్గాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎంత పన్ను చెల్లించాలనేది
ఒక స్పష్టత వచ్చి ఉంటుంది ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకూ ఆగకుండా. ఇప్పటి నుంచే పన్ను ప్రణాళికలో భాగంగా ఏం చేయాలన్నది తెలుసుకోవాలి

   ఆర్థిక ప్రణాళికలో ఆదాయపు పన్ను లెక్కలూ కీలకమే అందుకే, ఆర్థిక సంవత్సరం ముందు నుంచే దీనిపై ఆప్రమత్తంగా ఉండాలి, ఎంత పెట్టుబడి పెట్టాలన్నది తెలుసుకొని, దాన్ని నెలవారీగావిభజించి మదుపు చేస్తే.. ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయాల్సిన ఆవసరం తప్పుతుంది.
ఆర్టిక సంవత్సరం ముగియడానికి మరో మూడున్నర
నెలల సమయం ఉంది. ఇప్పుడు పన్ను ప్రణాళికల గురించి ఆలోచించకుండా.. మార్చి 31న పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నిస్తే.. సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కాబట్టి, ఇప్పటి నుంచి ఏం చేయాలన్నది పరిశీలిద్దాం
2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు
1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు
2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం
3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం
4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం
5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం


ఎంత చెల్లించాలి.....


ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం మరో పది హేనురోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మీరు ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందనేది మీ సంస్థ ఆకౌంట్స్ విభాగం చెప్పి ఉంటుంది. ఇక మీరు చేయాల్సింది... ఏ పథకంలో ఎంత మేరకు మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవడమే. సాధ్యమై
నంత వరకూ పన్ను మొత్తం ఎలా తగ్గుతుందన్నది చూసుకోవాలి, అరోగ్య బీమా లేకపోతే.. తీసుకోండి. సెక్షన్ 80సీ పరిమితి ఇంకా పూర్తికాపోతే.. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, యులీప్ లు వంటివి పరిశీలించవచ్చు. ఈ రెండు పరిమితులు పూర్తయితే
సెకషన్ 80సీసీడీ కింద రూ,50,000 వరకూ పన్ను మినహాయింపు పొందేందుకు జాతీయ పింఛను పథకాన్ని ఎంచుకోవచ్చు

లెక్కలు తీయండి....


ముందే చెప్పినట్లు. పన్ను భారం తగ్గించుకునే చివరి దశలోఉన్నాం. అదే సమయంలో అందుబాటులో ఉన్న సెక్షన్లను పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ పొదుపు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో
ఈపీఎఫ్, జీవిత బీమా పాలసీలు, ఈఎల్ఎస్ఎస్. ఇంటి రుణం అసలు చెల్లింపు, పిల్లల ట్యూషన్ఫీ జులు, జాతీయ పొదుపు పత్రాలు... పీపీఎఫ్ ఉంటాయి. ఒకసారి ఈ పరిమితి పూర్తిగా నిండిందా లేదా చూసుకోండి. మీటికి సంబంధించిన వివ
రాల కోసం మీ సంస్థలో సంప్రదించండి. ఇందులో పరిమితి పూర్తిగా నిండకపోతే.. సంబంధిత పథకాల్లో మీ ఆర్థిక ప్రణాళికకు సరిపోయే వాటిని ఎంచుకోండి. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్ 80డీ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల పేరుమీద పాలసీ తీసుకున్నా ఈ మిన
హాయింపు లబిస్తుంది. ఒకవేళ మీరు మీతల్లిదండ్రుల పేరు మీద పాలసీ తీసుకోలేదనుకుందాం. అప్పుడు వారి కోసం చేసిన వైద్య చికిత్స ఖర్చులను ఈ సెక్షన్ కింద క్లెయిం చేసు కునే వెసులుబాటు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినవిషయం ఏమిటంటే. పన్ను బారం తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతి వెసులుబాటునూ పూర్తిగా వినియోగించుకోవాలి, అదే మన లక్ష్యం కావాలి

పత్రాలు సిద్ధంగా....


పెట్టుబడులు పెట్టడమే కాదు.. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలూ జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాటిని మీ యాజమాన్యానికి గడువులోపు అందించాలి. లేకపోతే మీరు పెట్టుబడులు పెట్టినా.. ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్స
రంలో మీరు పెద్ద ఎత్తున బంగారం కొన్నా. స్థిరాస్తి లావాదేవీలూ నిర్వహించినా దానికి సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించినప్పుడు ఆ లెక్కలను తెలియజేయాలి. స్వల్పకాలిక, దీర్ఘ
కాలిక లాభనష్టాల గురించిన వివరాలు అందుబాటులో పెట్టుకోవాలి. ఈ ఆర్థికసంవత్సరంలో ఉద్యోగం మారితే.. పాత యాజమాన్యం నుంచి ఫారం -16 తీసుకోవాలి. దీని ఆధారంగా ఉమ్మడి ఫారం-16 ఇవ్వాల్సిందిగా కొత్త యాజమాన్యాన్ని కోర
వచ్చు

వడ్డీ చెల్లించండి....


ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యా రుణం తీసుకున్నారా? దానికి వడ్డీ చెల్లించలేదా? అలస్యం చేయకండి. దానికి సంబంధించిన వడ్డీని వెంటనే చెల్లించేయండి. ఇలా చెల్లించిన మొత్తానికి సెక్షన్
80ఈ  కింద మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి రుణం తీసుకున్నప్పుడు, దానికి చెల్లించే వడ్డీరూ.2,00,000 వరకూ మినహాయింపు లభిస్తుంది

ఈక్విటీలను అమ్మితే....


ఒక ఆర్ధిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడుల ద్వారా రూ.1,00,000కు మించి లాభం సంపాదించినప్పుడు దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను (ఎల్టీసీజీ) చెల్లించాల్సి ఉంటుంది. లాభం
రూ.లక్షకు మించినప్పుడు.. ఆపై మొత్తం పై ఈ పన్ను 10శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స
రంలో మీ మూలధన లాభం రూ.లక్ష దాటుతుందని అనుకుంటే... రూ.లక్షకు చేరే లోపే వాటిని విక్రయించండి ,మర్నాడు అవే షేర్లు/ఈక్విటీ ఫండ్లను
కొనుగోలు చేయండి. దీనివల్ల 10శాతం
ఎల్ టీసీజీ పన్ను పడకుండా చూసుకోవచ్చు

లక్ష్యం మర్చిపోవద్దు....


పన్ను తగ్గించుకునే క్రమంలో మనకు అనువుగాని పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం మంచిది కాదు. పన్ను ఆదాతోపాటు.. మన ఆర్థిక లక్ష్యాలను సాధించేలా మన పెట్టుబడులు ఉండాలి, 2019తో పోలిస్తే.. 2020లో ఆర్థిక పరంగా ఎన్నో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ ధోరణికి
తగ్గట్టూ పథకాల ఎంపిక ఉండాలి. ఇప్పటికే మీరు చేసిన పొదుపు, మదుపులను సమీక్షించుకోండి. మీరు అనుకున్న విధంగానే వాటి పనితీరు ఉందా లేదా చూసుకోండి. అశించిన పనితీరు చూపించని పథకాల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు మొహమాటపడొద్దు

Thanks for reading Tax time just Ahead - తగ్గించుకుందాం పన్ను భారం

No comments:

Post a Comment