Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 3, 2019

The rice card is just that Essential commodities


బియ్యం కార్డుంటేనే
నిత్యావసరాలు

  1. The rice card is just that Essential commodities
  2. Effective January 1
  3. Carrying a ration card is not valid
  4. New rice card within 5 days if applicable

The rice card is just that  Essential commodities
  1. జనవరి 1 నుంచి అమల్లోకి
  2. రేషన్ కార్డు తీసుకెళ్లినా చెల్లదు
  3. దరఖాస్తు చేస్తే 5 రోజుల్లోనే కొత్త బియ్యం కార్డు


ఇప్పుడున్న రేషన్ కార్డులు జనవరి1 నుంచి పౌరసరఫరాల దుకాణాల్లో చెల్లవు.
ప్రభుత్వం కొత్తగా ఇచ్చే బియ్యం కార్డు ఉంటేనే నిత్యా వసరాలు ఇస్తారు. అది తీసుకోకుంటే మళ్లీ కొత్తబియ్యం కార్డు వచ్చేదాకా అంటే జనవరి వరకు ఆగాల్సిందే. వివిధ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపికచేసేందుకు ప్రభుత్వం గత నెల 20 నుంచి 'వైఎస్సార్నవశకం' ప్రారంభించింది. పంచాయతీలు, వార్డులవారీగా వాలంటీర్ల ద్వారా సమగ్ర సర్వే నిర్వహించిబియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛను తదితర పథకాలకు వేర్వేరుగా కార్డులిస్తోంది. దీనిలో భాగంగా నెలనెలా నిత్యావసరాలు తీసుకునే వారికి ఇప్పుడున్న రేషన్ కార్డుస్థానంలో బియ్యం కార్డు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖనిర్ణయించింది. ప్రస్తుతం కార్డులున్న కుటుంబాల వివరాలను వాలంటీర్లకు అందించింది. రాష్ట్రంలో 147
కోట్ల రేషన్ కార్డులు ఉండగా, మంగళవారం నాటికి
సుమారు 80 లక్షల వరకు సర్వే పూర్తయింది. వచ్చే
నాలుగైదు రోజుల్లో మిగిలిన వాటిని పూర్తి చేయను
న్నారు. రేషన్ కార్డులున్న వారందరికి మళ్లీ కొత్త
కార్డులు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు

9న జాబితాల ప్రదర్శన

సంక్షేమ పథకాలకు అర్హుల జాబితాను ఈ నెల 9న
గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అందులో
ఎవరి పేరైనా లేకుంటే 3 రోజుల్లోగా దరఖాస్తు చేసు
కోవచ్చు. దానిని పరిశీలించి అర్హులను నమోదు చేసి
తుది జాబితా ప్రకటిస్తారు. వీరందరికీ నెలాఖరుకు
కొత్త బియ్యం కార్డులిస్తారు. చౌకధరల దుకాణాల డీలర్లకు ఇచ్చే జాబితాల్లోనూ ఇవే పేర్లుంటాయి.

సర్వే సమయంలో లేకుంటే

సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా ఇళ్ల
వద్ద లేకపోతే బియ్యం కార్డులు పొందే అవకాశం
లేదు. ఇలా ఎవరైనా మిగిలిపోతే. కొత్త కార్డుల
కోసం జనవరి మొదటి వారం వరకు ఆగాల్సిందే
జనవరి 1 నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని
బియ్యం కార్డు అవసరమైన వారు అక్కడ దర
ఖాస్తు చేస్తే అర్హులకు 5 రోజుల్లోనే ఇచ్చే ఏర్పాట్లు
చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్
కోన శశిధర్ తెలిపారు

Thanks for reading The rice card is just that Essential commodities

No comments:

Post a Comment