Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 19, 2020

How to Save money for children's education


How to Save money for children's education
పిల్లల చదువుల కోసం డబ్బును భద్రపరచండిలా
How to Save money for children's education

తమ పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారా వారు మంచిగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. చదువు వారి భవిష్యత్తకు భద్రతను కల్పిస్తుంది. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడుతున్నారు. అది సరైన రాబడిని ఇస్తుందా లేదా అనే విషయం కూడా అలోచించడం లేదు. ఒక చక్కటి ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంటే అవసరమైన సమయంలో పిల్లల చదువు ఖర్చులకు వెనుకాడే అవసరం ఉండదు. లేదంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సరైన ప్రణాళిక వేసుకుని మీ చిన్నారి చదువుకు బంగారు బాట వేయాలంటే మనం చేయాల్సిన పనులేంటో చూద్దామా?


   ప్రతి నెలా కొంత పెట్టుబడి పెట్టాలనుకునే వారు రికరింగ్ డిపాజిట్ తెరవచ్చు. బీమా పథకాలు బీమా రక్షణ కల్పించడంతోపాటు పన్ను మినహాయింపులు కూడా ఉండటంతో పిల్లల బీమా పథకాలకు డిమాండ్ అధికంగా ఉంది. దాదాపు అన్ని బీమా కంపెనీలూ పిల్లలకు ప్రత్యేకమైన బీమా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి మనీ బ్యాక్ పాలసీ కాగా, మరొకటి మొత్తం సొమ్ము చేతికి వచ్చే ఎండోమెంట్ పాలసీ. అయితే ఈ రెండు పాలసీల్లోనూ బీమా హామీ మొత్తం ఎక్కువగా ఉండదు కాబట్టి అధిక మొత్తంలో కవరేజీ ఇచ్చే టర్మ్ పాలసీ తీసుకుని ఉండాలి.

 దీనివల్ల ప్రీమియం చెల్లించే వ్యక్తికి ఏదైనా సంఘటన జరిగినా తదుపరి ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీని కొనసాగించేందుకు వీలుంటుంది. ఎల్ఐసీతో పాటు పలు ప్రయివేటు రంగ బీమా కంపెనీలు పిల్లలకు సంబంధించి ప్రత్యేక పాలసీలను ప్రవేశపెడుతుంటాయి. యులిప్స్ సరైనదేనా.... బీమా పథకాల్లో ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే... చెల్లించే ప్రీమియం పై పన్ను రాయితీలు లభించడంతోపాటు అందించే రాబడిని కూడా పూర్తిగా పన్నురహిత ఆదాయంగా పరిగణిస్తారు. ఇవి కూడా రిస్క్‌లేని స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. యులిప్స్ బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీల ప్రవేశంతో యూనిట్ ఆధారిత బీమా పథకాలకు ఆదరణ పెరిగింది. పైన చెప్పుకున్న రెండు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌తో పోలిస్తే ఇవి రిస్క్‌తో కూడుకున్నవి. వీటి రాబడులు స్టాక్, మనీ మార్కెట్ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

Thanks for reading How to Save money for children's education

No comments:

Post a Comment