Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 18, 2020

LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు


LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

LIC Agent Recruitment - మీరు పార్ట్ టైమ్ జాబ్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? లేదా ఫుల్ టైమ్ మంచి వృత్తిలో స్థిరపడదామనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. టెన్త్ పాసైతే చాలు ఎల్ఐసీ ఏజెంట్‌గా మారొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గురించి తెలియని వాళ్లుండరు. కాస్త డబ్బు పొదుపు చేయగల కుటుంబాల్లో తప్పనిసరిగా ఒక్కటైనా ఎల్ఐసీ పాలసీ ఉంటుంది. అలాంటి పాలసీలు అమ్మడం ఎల్ఐసీ ఏజెంట్ల పని.

2. మరి మీరు కూడా ఎల్ఐసీ ఏజెంట్ కావాలనుకుంటున్నారా? ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆసక్తిగలవారు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.

3. మరి ఎల్ఐసీ ఏజెంట్ కావాలంటే ఏం చదవాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎల్ఐసీ ఏజెంట్‌గా మారితే వచ్చే లాభాలేంటీ? ఈ వివరాలన్నీ ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://www.licindia.in/ లో ఉన్నాయి. ఆ వివరాలను తెలుసుకోండి.

4. పదవ తరగతి పాసైతే చాలు... ఎల్ఐసీ ఏజెంట్‌గా మారొచ్చు. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఎల్ఐసీ ఏజెంట్‌ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. లేదా స్థానికంగా ఉండే బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ను కాంటాక్ట్ కావొచ్చు.

5. బ్రాంచ్‌కు వెళ్తే 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, టెన్త్ మెమో, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. బ్రాంచ్ మేనేజర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎల్ఐసీ ఏజెంట్‌కు కావాల్సిన అర్హతలు మీకు ఉంటే డివిజనల్ లేదా ఏజెన్సీ ట్రైనింగ్ సెంటర్‌కు పంపిస్తారు. శిక్షణ 25 గంటలు ఉంటుంది.

6. లైఫ్ ఇన్స్యూరెన్స్ వ్యాపారానికి సంబంధించిన అన్ని అంశాలుంటాయి. శిక్షణ తర్వాత ప్రీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మీరు పరీక్ష పాసైన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్, ఐడెంటిటీ కార్డ్ వస్తుంది.

7. ఆ తర్వాత నుంచి మీరు ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా కెరీర్ మొదలుపెట్టొచ్చు. మొదట మిమ్మల్ని బ్రాంచ్ ఆఫీస్‌లో నియమిస్తారు. డెవలప్‌మెంట్ ఆఫీసర్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. మీకు ఫీల్డ్ ట్రైనింగ్ లాంటివన్నీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ చూసుకుంటారు.
8. మీకు కొత్త వ్యక్తుల్ని కలవడం, ఎక్కువగా తిరగడం ఇష్టమైతే, సొంతతెలివితేటలతో వ్యాపారంలో ఎదిగే ఆలోచనలు ఉంటే ఎల్ఐసీ ఏజెంట్గా కెరీర్ మొదలుపెట్టొచ్చు. రోజుకు ఎన్ని గంటలు కష్టపడాలన్నది మీ ఇష్టం. ఎన్నిగంటలైనా కష్టపడొచ్చు. ఎంత కష్టపడితే అంత లాభం.

9. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ప్రపంచ స్థాయి శిక్షణ కూడా లభిస్తుంది. మీ పనితనానికి తగ్గ గుర్తింపు, లాభాలు ఉంటాయి. మీరు ఫుల్ టైమ్ కాకపోయినా పార్ట్ టైమ్ ఏజెంట్‌గా కూడా సేవలు అందించొచ్చు. 

Thanks for reading LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

No comments:

Post a Comment