Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 24, 2020

Lists of Ration Beneficiaries to Village Secretaries


Lists of Ration Beneficiaries to Village Secretaries

మీ బియ్యం కార్డు ఉందా!
సచివాలయాలకు చేరిన లబ్ధిదారుల జాబితాలు
అభ్యంతరాలుంటే పునఃపరిశీలన
రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల నిరీక్షణ ఫలించింది.

   బియ్యం కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొద్దిరోజుల క్రితం నవశకం పేరిట జిల్లావ్యాప్తంగా వాలంటీర్ల సర్వే చేపట్టిన విషయం విదితమే. ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల్లో అర్హులు, అనర్హులు, కొత్త కార్డుల జారీకి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. వాస్తవానికి గత డిసెంబరు నెలలోనే ఈ జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించి.. జనవరి 1వ తేదీ నుంచి కొత్త బియ్యం కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రక్రియను వాయిదా వేసింది. తాజాగా బియ్యం కార్డుల జాబితాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆ మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాబితాలు నేరుగా మండల కార్యాలయాలకు చేరుకున్నాయి. వారి లాగిన్‌ల ద్వారా ఎక్కడికక్కడ డౌన్‌లోడు చేసుకుని సచివాలయాలకు పంపిస్తున్నారు. ఆయా సచివాలయాల్లో వీటిని ప్రదర్శనకు ఉంచుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 28వ తేదీ వరకూ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. 28వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తారు. ఈలోగా వచ్చిన విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించి.. తుది జాబితాను ప్రకటిస్తారు.

   నాలుగు రకాలుగా జాబితాలు: జిల్లాలో ప్రస్తుతం 7,10,620 రేషన్‌కార్డులు ఉన్నాయి. నవశకం సర్వే ద్వారా ఈ కార్డుదారులందరి వివరాలనూ వాలంటీర్లు సేకరించారు. అనర్హుల కార్డుల ఏరివేతతోపాటు.. కొత్తగా చేర్పులకూ అవకాశం కల్పించారు. వీటన్నింటి వివరాలతో ప్రస్తుతం నాలుగు రకాలుగా జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. అర్హులు, అనర్హులు, తాత్కాలిక వలసదారులు, శాశ్వత వలసదారులుగా విభజించి వేర్వేరుగా జాబితాలు ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుని పేరిట కారు, భూమి వంటివి ఉన్నట్లు చూపితే అటువంటి కార్డులను హోల్డ్‌లో చూపుతూ జాబితాలో ప్రదర్శనకు ఉంచారు. ఎక్కడో కార్డు ఉండి, ఈ సచివాలయ పరిధిలో ఉంటున్నవారి పేర్లన్నీ మరొక దాంట్లో ఉంచారు. అర్హులను అనర్హుల జాబితాలో చేర్చడం.. పేర్లు, చిరునామాలు వంటివి తప్పుగా పడటం వంటివాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిపై మళ్లీ పరిశీలన చేసి తహసీల్దార్లు నివేదిక అందిస్తారు. ప్రస్తుతం ప్రదర్శించిన జాబితాలో ఎవరిరకైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చని, మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని పౌరసరఫరాల అధికారులు  తెలిపారు.

Thanks for reading Lists of Ration Beneficiaries to Village Secretaries

No comments:

Post a Comment