Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 4, 2020

One crore with an investment of Rs 5,000 per month.


One crore with an investment of Rs 5,000 per month.

నెలకు రూ.5,000తో కోటి

One crore with an investment of Rs 5,000 per month.

   డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక్కడ చేతిలోని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే అకౌంట్‌లోకి ఏకంగా రూ.కోటి పైగా పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి. కేంద్ర ప్రభుత్వపు హామీ కూడా ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా తెరవండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే జనవరి- మార్చి త్రైమాసికానికి సంబంధించి పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించింది. అలాగే ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లను మార్చలేదు. అవి కూడా స్థిరంగానే ఉన్నాయి. 7.9 శాతం వడ్డీ పీపీఎఫ్ అకౌంట్‌పై ఇప్పుడు 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ మత్తం ప్రతి సంవత్సరం అకౌంట్‌లో జమవుతూ వస్తుంది.

  పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అయితే దీన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకునే అవకాశం అందుబాటులో ఉంది. నెలకు రూ.5,000తో కోటి పీపీఎఫ్ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే 35 ఏళ్లలో మీరు రూ.కోటికి పైగా పొందొచ్చు.
    అదే మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే 35 ఏళ్ల తర్వాత చేతికి ఏకంగా రూ.2.7 కోట్లు వస్తాయి. 30 ఏళ్లలో పీపీఎఫ్ ఖాతా తెరిస్తే.. మీరు పీపీఎఫ్ అకౌంట్‌ను 30 ఏళ్ల వయసులో ఓపెన్ చేశారని భావిద్దాం. అప్పుడు మీరు నెలకు రూ.7,189 ఇన్వెస్ట్ చేస్తూ వెలితే ప్రస్తుత 7.9 శాతం వడ్డీ రేటు ప్రాతిపదికన 30 ఏళ్ల తర్వాత రూ.కోటి పొందొచ్చు. అదే మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు రూ.1.8 కోట్లు లభిస్తాయి. నో ట్యాక్స్ పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్లపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన డబ్బు, అర్జించిన వడ్డీ, విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. అందువల్ల మీరు పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి మాత్రమే కాకుండా పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

Thanks for reading One crore with an investment of Rs 5,000 per month.

No comments:

Post a Comment