Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 6, 2020

PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండి


PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండి
PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండి

  పాన్ కార్డ్... చాలా ముఖ్యమైన ఫైనాన్షియల్ ఐడీ. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి దగ్గర ఒకే పాన్ కార్డు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉంటే అది నేరమే. మరి ఏం చేయాలో తెలుసుకోండి.


  1. మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్టయితే ఆదాయపు పన్ను చట్టాల కింద మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ కింద ఒక వ్యక్తి దగ్గర ఒకే పాన్ కార్డు ఉండాలి. 
  2. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్టయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ కింద రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరి మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయా? ఆదాయపు పన్ను శాఖ గమనించట్లేదని రెండో పాన్ కార్డు కూడా మెయింటైన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. 
  3. మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్టయితే సరెండర్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మీ పాన్ సరెండర్ చేయొచ్చు. 
  4. ఆన్‌లైన్‌లో పాన్ కార్డు సరెండర్ చేయాలంటే ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో 'Surrender Duplicate PAN' ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. 
  5. ఆఫ్‌లైన్‌లోనూ మీ పాన్ సరెండర్ చేయొచ్చు. ఇందుకోసం మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారికి లేఖ రాయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాలు, పాన్ నెంబర్ వివరాలను వెల్లడించాలి. దగ్గర్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో మీ లేఖను డిపాజిట్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. 
  6. పాన్ కార్డు పోతే కొత్త పాన్ కార్డు తీసుకుందామని అనుకుంటారు. తెలియకుండా రెండో పాన్ కార్డుకు దరఖాస్తు చేస్తారు. అలా కాకుండా మీ దగ్గర గతంలో ఉన్న పాన్ కార్డుకే డూప్లికేట్ తీసుకుంటే సరిపోతుంది.
  7.  ఒకవేళ మీ పాన్ నెంబర్ మీకు గుర్తులేనట్టైతే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో "Know Your PAN" క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ పేరు, తండ్రి పేరు, పుట్టినతేదీ వెల్లడించాల్సి ఉంటుంది. 

Thanks for reading PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండి

No comments:

Post a Comment