Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, February 18, 2020

Based on e-Hazar, salaries are assessed in online and bills are sent to the Treasury.


Based on e-Hazar, salaries are assessed in online and bills are sent to the Treasury.


The school education department has directed district education officials to take actions to register 100% E Hazar.

E-Hazar ఆధారంగా వేతనాలను ఆన్ లైన్  లో మదింపు చేసి బిల్లులను ట్రెజరీకి పంపుతారు.
100 శాతంE-Hazar నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ..

   రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇకపై E-Hazar తప్పనిసరి కానుంది . ఏప్రిల్ నెల నుంచి ఆన్ లైన్ లోనే హాజరు వివరాలతో వేతనాలు మదింపు చేసి బిల్లులను ట్రెజరీ పంపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది . 
 రాష్ట్రంలో ఉపాధ్యాయులకు E-Hazar విధానాన్ని 2011లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది . 11 , 500 పాఠశాలల్లో E-Hazar విధానాన్ని అమలు చేస్తున్నారు . 1 . 80 లక్షల మంది ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకుంటున్నాడు . ఈ హాజరు విధానం ప్రారంభించిన తొలినాళ్లలో ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత చోటు చేసుకుంది . బయోమెట్రిక్ యంత్రాలు నాసిరకం కావడం , నెట్వర్క్ సరిగా  పని చేయకపోవడం వంటి కారణాలతో ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించింది . పేరు నమోదుకు 30 నిమిషాల వరకూ పట్టడం , తదితర కారణాల వల్ల E-Hazar పై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమయింది . వివిధ కారణాల వలన ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఈ - హాజరును తప్పనిసరి చేయలేదు . సమాంతరంగా మాన్యువల్ గా హాజరు వివరాలు నమోదు చేస్తున్నారు . ఇది తప్పనిసరి కాకపోవడంతో కొంతమంది మాత్రమేE-Hazar నమోదు చేస్తు న్నారు . ఈ విధానంలో విధులకు హాజరైన సమయం , వెళ్లిన సమయం కూడా నమోదు అవుతుంది . సెలవులు తదితరాలను పరిగణలోకి తీసుకుని వేతన బిల్లులను మాన్యువల్ గా తయారు చేస్తున్నారు . మాన్యువల్ గా బిల్లుల తయారిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది . కొన్ని సందర్భాల్లో బిల్లులను ఆమోదింప చేసుకోవడంలో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు . దీనిపై పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది .E-Hazar రును తప్పనిసరి చేయడం ద్వారా కొన్ని అక్రమాలకు తెరదించవచ్చని భావి స్తోంది . ఇందులో భాగంగా E-Hazar ను తప్పనిసరి చేస్తూ తాజాగా ఉత్త ర్వులు జారీ చేసింది . దీంతో ఉపాధ్యాయులు సెలవు పెడితే తప్పనిసరిగా ముందుగా తెలియచేయాల్సి ఉంటుంది . సెలవు పెట్టకుండా , హాజరు నమోదు చేయకుండా ఉంటే విధుల నుంచి గైర్హారుగా భావిస్తారు . విధులకు హాజరైతే E Hazar లో నమోదు అవుతుంది . ఇలా E Hazar ఆధారంగా వేతనాలను ఆన్లైన్ లో మదింపు చేసి బిల్లులను ట్రెజరీకి పంపుతారు . ట్రెజరీ నుంచి వేతనాలు ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి . ఈ విధానం వల్ల  వేతనాల మదింపులో సిబ్బంది ప్రమేయం ఉండదు . ఉపాధ్యాయులు E-Hazar ను 100 శాతం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధి కారులకు ఆ శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది 

ఐ.టి.సెల్
-----
ఈ-హాజరు" నమోదులో పాటించవలసిన ముఖ్యమైన కొన్ని సూచనలు.

1. పాఠశాలలో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఈ-హాజరు నమోదు చేయవలెను.

2. పాఠశాలకి వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు తప్పనిసరిగా ఈ-హాజరు నమోదు చేయవలెను.ఈ-హాజరు నమోదులో పాఠశాల నిర్ణీత సమయమును తప్పనిసరిగా పాటి౦చాలి.

3. సెలవు కానీ లేదా పాఠశాల బయట విధినిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను

4. సెలవు పెట్టినప్పుడు తప్పనిసరిగ పాఠశాల ప్రార౦భ సమయమునకు ముందే APTeLs ఆప్ నందు నమోదు చేయవలెను.

5. వైధ్యకారణాలు లేదా వ్యక్తిగత కారణాల వలన సెలవు పెట్టినచో, సంబంధిత దృవపత్రమును APTeLs ఆప్ లో UPLOAD చేయవలెను.

6. పాఠశాల బయట విధులు నిర్వహిచవలసినప్పుడు, APTeLs ఆప్ న౦దు ఈ క్రి౦ది తెలిపిన విధముగా Options ఎంచుకోవలెను.

a. Work at Treasury: ఖజానా కార్యాలయము నందు పని ఉన్నచో ఎంచుకోవలెను.

b. Work at DYEO: ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయము నందు పని ఉన్నచో ఎంచుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను.

c. Work at DEO:
జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము నందు పని ఉన్నచో ఎంచుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను.

d. Work at MEO:
మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయము నందు పని ఉన్నచో ఎంచుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను.

e. Academic Monitoring: పాఠశాల పర్యవేక్షణ విధులు నిర్వహణకి ఎంచుకోవలెను.

f. Sports:
క్రీడల విధుల నిర్వహణకి ఎ౦చుకోవలెను.

g. Field Visits:
విద్యా విజ్ఞాన విహార యాత్రలకి ఎ౦చుకోవలెను.

h. Election Duty:
ఎన్నికల విధులకి ఎంచుకోవలెను

i. Request to DDO:
బ్యా౦కు విధులు మరియు ఇతర విధులకి ఎంచుకోవలెను.

j. Science Fare:
విజ్ఞాన ప్రదర్శనలకి ఎంచుకోవలెను.

k. Training:
శిక్షణా కార్యక్రమములకి ఎంచుకోవలెను. శిక్షణా కేంద్రము పేరు నమోదు చేయవలెను.

l. Deputation:
పని సర్దుబాటులో వేరొక పాఠశాలలో విధులు నిర్వహించుటకు ఎంచుకోవలెను. సంబంధిత పాఠశాల డైస్ కోడు తప్పనిసరిగా నమోదు చేయాలి. పాఠశాల ప్రారంభ సమయమునకి ముందుగా APTeLS ఆప్ నందు నమోదు చేయాలి. సంబంధిత అధికారి Online లో వెంటనే ఆమోదించవలెను. లేని ఎడల EHazar నందు Absent గా అగుపించును ఆమోదము తెలిపిన తరువాత సంబంధిత పాఠశాల పరికరము నందు DATA SYNC క్లిక్ చేయవలెను.

 తరువాత DOWNLOAD TEACHER MASTER క్లిక్ చేయవలెను.Succefully downloaded అని వస్తు౦ది. OK క్లిక్ చేసి వెనుకకి వచ్చి యదావిధిగా హాజరు నమోదు చేయవలెను.

గమనిక ----
APTeLs ఆప్ న౦దు నమోదు చేయబడిన ప్రతీ విషయము (సెలవు,  Deputation మెుదలగునవి) కూడ ఎప్పటికప్పుడు అదే రోజున సంబంధిత అధికారి Online నందు   CSE Login లో ehazar.ap.gov.in ద్వారా గాని లేదా APTeLSలో DDO login ద్వారా గాని అ౦గీకారము లేదా తిరస్కారము (Approve Or Rejected) చేయవలెను.

 ముఖ్య గమనిక --
Ehazar నందు లేదా APTeLs ఆప్ న౦దు నమోదు చేయ కున్నా లేదా నమోదు చేసిన వాటిని  ఎప్పటికప్పుడు అదే రోజున సంబంధిత అధికారి Online లో  Approve  లేక Rejected చేయనిచో  మన జిల్లా హాజరు శాతం తగ్గి పోవును.
కావున వెంటనే ఆమోదించవలెను



Thanks for reading Based on e-Hazar, salaries are assessed in online and bills are sent to the Treasury.

No comments:

Post a Comment