Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 6, 2020

Income Tax: కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి.


Income Tax: కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి
Income Tax:


దిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుల్లో రెండు విధానాలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త, పాత విధానాల ద్వారా ఎంత పన్ను కట్టాలో సరిచూసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను విడుదల చేసింది. ఈ కాలిక్యులేటర్ ద్వారా కొత్త విధానంలో ఎంత కట్టాలో.. పాత విధానమైతే ఎంత కట్టాలో చెల్లింపుదారులు పోల్చుకునేందుకు వీలుంటుంది.

పాత, కొత్త విధానాల ద్వారా పన్నులను సరిపోల్చుకునేందుకు టేబుల్‌తో కూడిన ఈ-కాలిక్యులేటర్‌ను ఐటీ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఐటీ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు. పాత విధానంలో ఎంత ఆదాయానికి పన్ను చెల్లించాలి.. కొత్త విధానానికి మారితే ఎంత పన్ను తగ్గుతుంది తదితర వివరాలను ఈ కాలిక్యులేటర్‌తో తెలుసుకోవచ్చు. బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ కాలిక్యులేటర్‌ను తయారుచేశారు.


ఆదాయపు పన్ను శ్లాబులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. అయితే అదే సమయంలో పాత విధానమూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేగాక, కొత్త శ్లాబులను వాడుకుంటే ఎలాంటి మినహాయింపులు వర్తించబోవంటూ ఓ మెలిక కూడా పెట్టింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ప్రస్తుతం 100కు పైగా మినహాయింపులు ఉండగా.. కొత్త విధానంలో వీటిల్లో దాదాపు 70కి పైగా తొలగించినట్లు వెల్లడించింది. దీంతో ఏ విధానం మేలు చేస్తుందనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
Click here .. Compare Tax under Existing and New Regime

Thanks for reading Income Tax: కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి.

No comments:

Post a Comment