Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, February 9, 2020

National Deworming Day


National Deworming Day 

Deworming Day is being held on the 10th of this month.

మన ఆరోగ్యం.. మన చేతుల్లో...!
ఒక్క మాత్రతో వ్యాధి నివారణ
రేపు నులిపురుగుల నివారణ దినం
ఈనెల 10న  డీ వార్మింగ్‌ డేను నిర్వహించున్నారు..

 అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ మాత్రలను చిన్నారులకు అందించనున్నారు.

🔸రెండేళ్ల నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారికి ఈ మాత్రలను అందజేయనున్నారు. ఈ దఫా ప్రైవేటు పాఠశాలల చిన్నారులకు సైతం ఈ మాత్రలను ప్రభుత్వం సరఫరా చేయనుంది. వీటిని ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా పిల్లలకు అందజేస్తున్నారు. ఈ పురుగులు కడుపులోకి చేరి పలు రకాల వ్యాధులను గురి చేస్తాయి. చిన్నారులు ఎక్కువగా మట్టిలో ఆడుకోవడం, చేతులు పరిశుభ్రం చేసుకోకపోవడం వలన ఈ పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి ఫలితంగా చిన్నారుల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇవి సన్నటి దారాల్లా ఉండి పేగుల గోడలకు అంటిపెట్టుకొని రక్తాన్ని పీల్చివేస్తాయి. తిన్న ఆహారం వంట పట్టకుండా చేస్తాయి. ఇవి ప్రధానంగా ఏలికపాములు, నులి పురుగులు, కొంకి పురుగులుగా శరీరంలో ఉంటున్నాయి. 50 నుంచి 60 శాతం మంది ఏదొక రకం నులిపురుగుల భారిన పడి రక్తహీనతకు, అనారోగ్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కలిగించే అనారోగ్యాలు .
  1. రక్త హీనత, నీరసం, దగ్గు, ఆయాసం, ఎదుగుదల లేకపోవడం, చదువులో ఏకాగ్రత లోపించడం, మలమూత్ర విసర్జన ప్రదేశాల్లో దురద, చర్మంపైన ఎర్రని దద్దులు, దురద రావడం, బరువు తగ్గడం, పోషకాహార లోపం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి ఉండడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు వీటి ద్వారా కలుగుతాయి.
  2. నులి పురుగులు శరీరంలో ప్రవేశించకుండా ఉండేందుకు భోజనానికి ముందు, ఆటలు ఆడిన తర్వాత, మలమూత్ర విసర్జన తర్వాత చేతులు సుమారు 2 నిమిషాలు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  3. ప్రత్యేకించి ఏడాది వయస్సు వారికి, గర్భిణిలు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధిత క్యాన్సర్‌ ఉన్నవారికి, పుట్టుకతో గుండె వ్యాధులు ఉన్నవారికి ఈ మాత్రలను ఇవ్వకూడదు.
వ్యాప్తి ఇలా..!
  1. కలుషిత ఆహారం, ఈగలు, దుమ్ము, ధూళి చేరిన ఆహార పదార్థాలను తినడం.
  2. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం.
  3. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరకులు శుభ్రమైన నీటితో కడకపోవడం.
  4. భ్రోజనం వండేవారు,వడ్డించేవారు, తినే ముందు..తిన్న తరవాత చేతులు శుభ్రంగా కడగకపోవడం.
  5. చేతులకు గోళ్లు ఉండడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం.
  6. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల పిల్లలు ఆడుకొనే సమయంలో నులిపురుగుల లార్వాలు జీర్ణకోశంలోకి ప్రవేశించడం.. తదితర కారణాలతో ఇవి వ్యాప్తి చెందుతాయి.
మాత్రలను ఎలా తీసుకోవాలి..
  1. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆల్బెండజోల్‌ 400 మి.గ్రా మాత్ర ఒక్కరోజు వేయాలి.
  2. 2 నుంచి 5 ఏళ్లలోపు ఉన్నవారికి సగం మాత్రను 1/2 గ్లాసు వాటర్‌లో కరిగించి, తాగించాలి.
  3. 6, 18 ఏళ్లలోపు వారు ఒక్క మాత్రను చప్పరించి మింగాలి.
  4. మధ్యాహ్నం భోజనం అయిన అరగంట సమయం తర్వాత ఈ మాత్రను వేసుకోవాలి.
A Small video about Deworming day.
               

Thanks for reading National Deworming Day

No comments:

Post a Comment