Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, February 22, 2020

The Hormones needed to live happily ever after. బ్రతికినంతకాలం ఆనందంగా బ్రతుకుతూ ఉండాలంటే కావలసిన హార్మోన్లు అవి పొందాలంటే......


The Hormones needed to live happily ever after.
బ్రతికినంతకాలం ఆనందంగా బ్రతుకుతూ ఉండాలంటే కావలసిన హార్మోన్లు అవి పొందాలంటే......


   ప్రతి మనిషీ జీవితంలో ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. ఎలాంటి కష్టాలు తమ దరికి రాకుండా ఉండాలని భావిస్తుంటారు. అయితే... మనిషి ఏడ్వాలన్నా.. నవ్వాలన్నా.. హార్మోన్లపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


 శరీరంలో ప్రతి ఒక్కరికి నాలుగు రకాల హార్మోన్లు ప్రతివారు సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి. ఇవి అందరికీ చాలా ముఖ్యమైనవి. ఈ హార్మోన్లు సరియైన సమయంలో విడుదల అవుతే బ్రతికినంతకాలం ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు. ఆ హార్మోన్ల పేర్లు తెలుసుకుందాం.



1. ఎండార్ఫిన్‌, 2. డోపమైన్‌, 3. సెరొటోనిన్‌, 4. ఆక్సిటోసిన్‌ ఈ హార్మోన్లే వ్యక్తుల సంతోషానికి కారణం. ఏ ఏ పనులు చేస్తే వ్యక్తులకు ఈ హార్మోన్లు విడుదల అవుతాయో తెలుసుకుందాం.


1. వ్యాయామం చేసినప్పుడు ఎండార్పిన్ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది వ్యాయామం చేసినప్పుడు కలిగే నొప్పిని తట్టుకోవడానికి సహకరిస్తుంది. అందుకే వ్యాయామం చేయగానే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు కూడా ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది.


2. జీవితంలో ఏవైనా లక్ష్యాలను సాధించినప్పుడు డోపమైన్ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఏ మంచిపనైనా చేసినప్పుడు, లేదా ఇష్టమైన వస్తువులు, బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది. సాధారణంగా మహిళలకు ఇది ఎక్కువగా విడుదల కాదు.


 కారణం వారికి కావలసిన ప్రశంసలు ఇంటిలో ఉండవు. తమకు ప్రశంసలు దొరికితే ఈ హార్మోన్‌ విడుదలై వారు ఎక్కువగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగం దొరికినప్పుడు, కారు కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు ఇంటిలో కొత్త వస్తువులు కొన్నప్పుడు ఈ హార్మోన్లు విడుదల అవుతాయి.


3.సెరొటోనిన్ అనే హార్మోన్‌ మనం చేసే పనివల్ల ఎదుటివ్యక్తులు సంతోషపడుతున్నారు, ఎక్కువ తృప్తి చెందుతున్నారు అనుకున్నప్పుడు ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఎదుటివారికి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల, విలువైన బహుమతులు ఇవ్వడం వల్ల ఎదుటివారికి సర్‌ప్రైజ్‌ చేసినప్పుడు కూడా ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ విడుదల కావాలంటే పరోపకారం దానం ముఖ్యమైనవి. కావున ఈ హార్మోన్‌ కూడా ప్రతిరోజు శరీరంలో విడుదల కావడం కూడా అంతే ముఖ్యం.


4. ఆక్సిటోసిన్.. అనుబంధాలు పెంచుకున్నప్పుడు ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది. చిన్న పిల్లలను హగ్‌ చేసుకున్నప్పుడు కూడా ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఎదుటివారు కోపంగా ఉన్న విషయాన్ని గ్రహించి వారిని హగ్‌ చేసుకున్నప్పుడు కూడా ఎదుటివారిలో కోపాన్ని పోగొడతారు కావున ఆ సమయంలో కూడా ఈ హార్మోన్‌ విడుదల అవుతుంది.


పై నాలుగు హార్మోన్సు మొదటి రెండు తమకోసం తాము చేసే పనుల వల్ల విడుదల అవుతాయి. తరువాతి రెండు హార్మోన్లు ఎదుటివారికోసం చేసే పనుల వల్ల విడుదల అవుతాయి. కావున ప్రతీరోజూ అందరూ తమకోసం తాము పనులు చేసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. పరోపకారం దానం చేయడం వల్ల మిగతా రెండు హార్మోన్లు విడుదల వల్ల వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా బ్రతికుతూ ఉంటారు.

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంతో గడపడానికి ఈ హార్మోన్లు తప్పనిసరి అవసరం. ఈ హార్మోన్లు విడుదల అవుతేనే వ్యక్తి ఆనందంగా ఉంటారు. తాను సంతోషంగా ఉంటేనే తోటివారిగురించి ఆలోచిస్తారు. సమాజం గురించి ఆలోచన పెరుగుతుంది. తనే సరిగా లేకపోతే పక్కవారిపై ఆలోచన ఉండదు. ఈ భూమిపైకి ఎందుకు వచ్చామో వచ్చిన పని పూర్తి చేసుకునే ఆలోచనతోనే అందరూ ఉండాలి.

Thanks for reading The Hormones needed to live happily ever after. బ్రతికినంతకాలం ఆనందంగా బ్రతుకుతూ ఉండాలంటే కావలసిన హార్మోన్లు అవి పొందాలంటే......

No comments:

Post a Comment