Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 20, 2020

BSNL announces bumper offer in the wake of Corona


BSNL announces bumper offer in the wake of Corona
కరోనా నేపథ్యంలో బంపర్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
BSNL announces bumper offer in the wake of Corona

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా కనెక్షన్లు తీసుకున్నవారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తుండగా, ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే అదేబాటలో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా తమకు మరిన్ని కొత్త కనెక్షన్లు వస్తాయని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ బ్రాడ్ బ్యాండ్ అంటూ సరికొత్త ప్లాన్ ప్రకటించింది.

ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారు కొత్తగా బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కావాలనుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
దీనిపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ స్పందిస్తూ, తమ కొత్త ప్లాన్ తో ఉద్యోగులు ఇంటి నుంచి బయటికి రాకుండానే పని చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారికి, కొత్తగా కనెక్షన్ తీసుకున్నవారికి ఉచితంగా ఒక నెల పాటు బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా వసూలు చేయబోమని, అయితే వినియోగదారులు ఇంటర్నెట్ మోడెమ్ ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.


JIO Offers


ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ నూతన 4జీ డేటా వోచర్లను తాజాగా ప్రకటించింది. 4జీ సౌకర్యంతో పాటుగా టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ.101 ప్లాన్స్ వరకు అందుబాటులో ఉంచింది. ఒకసారి అధిక వేగంతో డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చునట.

ప్లాన్స్ ఇలా ఉన్నాయి…

రూ.11 - 800ఎంబీ డేటా.. 75 నిమిషాల టాక్‌టైమ్‌
రూ.21 - 2జీబీ డేటా.. 200 ని.టాక్‌టైమ్‌
రూ.51 - 6జీబీ డేటా.. 500 ని.టాక్‌టైమ్‌
రూ.101 - 12 జీబీ డేటా.. 1000 ని.టాక్‌టైమ్‌.. అయితే రూ.251 వోచర్‌కు మాత్రం అదే పాత ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

Thanks for reading BSNL announces bumper offer in the wake of Corona

No comments:

Post a Comment