Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 23, 2020

Full lockdown in 19 states and Union Territories- central government Guidelines 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి లాక్​డౌన్ - కేంద్రం మార్గదర్శకాలు


Full lockdown in 19 states and Union Territories- central government Guidelines
19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి లాక్​డౌన్
- కేంద్రం మార్గదర్శకాలు


దేశంలో ఇప్పటివరకు 415 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు అధికారులు. 23 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. వైరస్ నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న జాగ్రత్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి లాక్​డౌన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాక్షిక మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నమూనాల సేకరణ

కరోనా అనుమానితులకు సంబంధించిన రక్త నమూనాలను దేశవ్యాప్తంగా ఉన్న 15,000 కేంద్రాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు ఐసీఎంఆర్ డైరెక్టర్. ఆయా కేంద్రాల ద్వారా సేకరించిన నమూనాలను ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో పరిశీలించి ఫలితాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు.

బాధితులకు సేవపై..

బాధితులకు సేవచేసే అంశమై భయపడకూడదని వైద్య సిబ్బందికి సూచించారు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ. వైద్య సేవలు అందించేందుకు ఆందోళన చెందకూడదన్నారు. పాజిటివ్​గా తేలిన వారికి సేవలు అందించిన అనంతరం హైడ్రాక్సీక్లోరోక్విన్ ద్రావణంతో శుభ్రం చేసుకుంటే చాలని చెప్పారు. స్వీయ నిర్బంధంలో ఉన్న బాధితులకు సేవలందించేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

కఠినంగా లాక్​డౌన్​...

పాక్షిక లాక్​డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమని, ఆయా రాష్ట్రాలు పూర్తిస్థాయిలో మూసివేత చేపట్టాలని చెప్పారు. లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేశారు ఆరోగ్య శాఖ అధికారులు.

పుణెలో కిట్ల తయారీ..

కరోనా పరీక్ష కిట్లను పుణెలో తయారు చేయనున్నట్లు చెప్పారు ఐసీఎంఆర్ డైరెక్టర్. తయారైన కిట్లను ఎఫ్​డీఏ ఆమోదాన్ని త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వారిని వెనక్కి రప్పిస్తాం..

ఐరోపాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు విదేశాంగ శాఖ ప్రతినిధులు. వారిని వెనక్కి తీసుకొచ్చే అంశమై ఆయా దేశాలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

Thanks for reading Full lockdown in 19 states and Union Territories- central government Guidelines 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి లాక్​డౌన్ - కేంద్రం మార్గదర్శకాలు

No comments:

Post a Comment