Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 7, 2020

Google Pay Balance Checking Option:గూగుల్ పే లో బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ మాయం..ఎలా చూడాలో తెలుసా?


Google Pay Balance Checking Option: గూగుల్ పే లో బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ మాయం..ఎలా చూడాలో తెలుసా?

Google Pay Balance Checking Option:గూగుల్ పే లో బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ మాయం..ఎలా చూడాలో తెలుసా?

Google Pay లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళితే బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ చూయించేది. దాని పై క్లిక్ చేస్తే బ్యాలెన్స్ వివరాలు వచ్చేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది. Google Pay యాప్ లో చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ చూయించడం లేదు. దీంతో బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు.Google Pay యాప్ లో బ్యాలెన్స్ చెకింగ్ ఈ విధంగా చేసుకోవాలి.
  1. Google Pay యాప్ ఓపెన్ చేయగానే మీ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయాలి.
  2. యాప్ లో రైట్ సైడ్ టాప్ లో మీ ప్రొఫైల్ పిక్ చూయిస్తుంది.
  3. దాని మీద క్లిక్ చేయగానే పేమెంట్ మెథడ్స్ అని వస్తుంది. అందులో మీ బ్యాంక్ పేరు, అకౌంట్ నంబర్ వస్తుంది.
  4. దాని పై క్లిక్ చేస్తే మీ యాక్టివేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ చూయిస్తుంది.
  5. దాని పై క్లిక్ చేస్తే వ్యూ బ్యాలెన్స్ అనే ఆప్షన్ వస్తుంది.
  6. దాని పై క్లిక్ చేసి మీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే మీ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

అయితే తాజాగా ఫోన్ పే ప్రభావం Google Pay పై కూడా పడింది. Google Pay యాప్ లో కొన్ని ట్రాన్స్జాక్షన్స్ జరుగుతుండగా, కొన్ని ట్రాన్స్జాక్షన్స్ పెండింగ్ లో పడుతున్నాయి. దీనికి సంబంధించి గూగుల్ పే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఫోన్ పే ద్వారా లావాదేవీలు నిలిచి పోవడంతో Google Pay ద్వారా ఎక్కువ మంది ట్రాన్స్జాక్షన్స్ చేస్తున్నారు. దీంతో Google Pay సర్వర్ కి లోడ్ ఎక్కువై లావాదేవీలు ఫెయిల్ అయితునట్టు యూజర్స్ తెలిపారు. కానీ దీని పై Google Pay స్పందించలేదు.
యస్ బ్యాంక్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడంతో దాని ప్రభావం ఫోన్ పే పై పడింది. దీంతో ఫోన్ పే లావాదేవీలన్ని స్తంభించిపోయాయి. యస్ బ్యాంక్ పై ఆర్బీఐ మారటోరియం విధించింది. ఫోన్ పే కు యస్ బ్యాంక్ అతి పెద్ద పేమెంట్ భాగస్వామిగా ఉంది. యస్ బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో ఉండడంతో ఫోన్ పేలో ట్రాన్స్జాక్షన్స్ జరగడం లేదు. కొన్ని లావాదేవీలు జరిగినా మరికొన్ని పెండింగ్ లో ఉంటున్నాయి.
ఆర్బీఐ నిర్ణయంతో యస్ బ్యాంక్ ఖాతాదారులు నెలకు రూ.50 వేలు మాత్రమే డ్రా చేసుకోగలరు. ఆర్బీఐ నగదు డ్రా పై విధించిన ఈ తాత్కాలిక నిషేధం 2020 మార్చి 5 సాయంత్రం 6 గంటల నుంచి 2020 ఏప్రిల్ 3 వరకు వర్తిస్తుంది. యస్ బ్యాంక్ కస్టమర్లు పెళ్లి, మెడికల్ ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్ వంటి అంశాలకు సంబంధించి తగిన ప్రూఫ్ లు చూపి రూ.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Thanks for reading Google Pay Balance Checking Option:గూగుల్ పే లో బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ మాయం..ఎలా చూడాలో తెలుసా?

No comments:

Post a Comment