Inspiration Teacher Mandala Satyannarayana
ఆ తరగతి గదికి వెళితే రంగురంగుల చిత్రాలు దర్శనమిస్తాయి .
ఎటు చూసినా . . జాతీయ నాయకుల ఫొటోలు తళుక్కుమంటాయి .
మరో మెట్టుపైకెక్కి , విద్యా బోధన కూడా బొమ్మల ద్వారానే బోధిస్తారు .
ఇవి ఏ కెమెరాలతో , సెల్‌ఫోన్లో తీసినవి కాదు .
ఓ ఉపాధ్యాయుడు తన హస్తాలతో గీచిన చిత్రాలు .
ఆయనే . . గంట్యాడ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మండల సత్యనారాయణ .
బొమ్మలతో విద్యా బోధన
విద్యార్థులను ఆకట్టుకుంటున్న వైనం " వినూత్న రీతిలో బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ
ఎందరో మహానుబావులు అందరికీ వంద నాలు అన్నాడో మహాకవి . దేశ నాయకులు త్యాగాలు ఫలితంగా నేడు మనం ఎంతో స్వేచ్ఛగా జీవించగలుతున్నామన్నది జగమెరిగిన సత్యం . అటువంటి మహానుబావుల జీవిత చరిత్రలను బోధిస్తున్నారు . ఆ ఉపాద్యాయుడు . విద్యార్థులకు తను గీచిన చిత్రాల ద్వారా బోధన చేస్తున్నారు . ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నాయకు లు ముందు చూపు కారణంగా మనం వారి ఫలాలను అనుభవిస్తున్నాం . అయితే , నేటి తరానికి వారెవరో , ఎలా , ఉంటారో కనీసం తెలియని పరిస్థితి . విద్యార్థులు రేపటి తరానికి వారసులు ,విషయం గుర్తించిన ఆ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తనలో ఉన్న ఆలోచనకు పదును పెట్టారు . గత పదిహేనేళ్లుగా వినూత్న రీతిలో బోధన చేస్తూ ముందుకు సాగుతున్నారు . ప్రతి రోజూ ఏదో ఒక పర్వదినం ఉంటుంది . ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ముఖ్యంగా దేశ నాయకులు , శాస్త్రవేత్తలు , రాజు కీయ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టిన గొప్పవారి గురించి నేటి విద్యార్థులకు వివరించా లని సంకల్పించారు . చిన్నారులకు కలకాలం గుర్తుండుపోవాలని బొమ్మ గీస్తూ , బోధన చేస్తుండడం విశేషం . ఆ యనే . గంట్యాడ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాద్యాయుడు శ్రీ మండల సత్యన్నారాయణ.
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు
మెంటాడ గ్రామానికి చెందిన మండల కన్నయ్య అప్పయ్యమ్మ దపంతుల కుమారుడు సత్యనారాయణ . వీరిది వ్యవసాయ కుటుంబం . చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు వెంటాడే వి . అయితే చదువు అంటే మక్కువ . ఇంటర్ తరువాత విజయనగరంలోని ఎంఆర్ కళాశాల లో డిగ్రీ సీటు పొందారు . అయితే ఆర్ధిక ఇబ్బం దులు మాత్రం విడవలేదు . అదే సమయంలోఅప్పటి కలెక్టర్ నాగిరెడ్డి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షర విజయం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ఈ కార్యక్రమంలో సత్యనారాయణ వలంటీర్ పని చేసి , మండల స్థాయిలో ఉత్తమ వలంటీర్‌గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు . ఆ ఘటనే ఆయనలో ఉపాధ్యాయుడు కావాలన్న కోరిక కలిగించింది . అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన విద్యా ప్రయాణం . ఉన్నత స్థాయికి చేరింది . అనంతరం ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ కొలువు సాధించారు . మొదట తూర్పుగోదావరి జిల్లాలో పనిచేశారు . అక్కడ నుంచి విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారు . గణపతి నగరం మండలం పాతబగ్గాం , ఎరుకుల పేట , విజయనగరం మండలం కొండకరకాం పార శాలల్లో పనిచేశారు . ప్రస్తుతం గంట్యాడ జడ్సీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు .• ప్రతిభకు గుర్తింపు
ఉపాధ్యాయుడు సత్యనారాయణ ప్రతిభను 2008వ సంవత్సరంలోనే జిల్లా అధికారులు గుర్తించారు . అప్పటి నోడల్ అధికారి వీరబ్రహ్మేంద్రస్వామి పనిచేసిన సమయంలో ప్రత్యేకంగా గుర్తించారు . అప్పటిలో నిర్వహించిన విజయనగరం ఉత్సలో సత్యనారాయణ గీచిన జాతీయ నాయకుల చిత్రాలను ఎగ్జిబిషన్లో ప్రద ర్శించారు .దేశభక్తి ఉండాలనే తపన
దేశ నాయకులు జయంతి , వర్ణం తులను పురస్కరించుకుని వారివార్ చిత్రాలను ఉపాధ్యా యుడు మండల సత్యనారాయణ స్వయంగా గీసి విద్యార్థు లకు ప్రదర్శించి , బోధన చేస్తున్నా రు . గాందీ , నెహ్రూ , అల్లూరి సీతారామరాజు , సరోజిని నాయుడు , సర్వేపల్లి రాధాకష్టన్ , మదర్ థెరిస్సా ఇందిరా గాంధీ , సర్దార్ వల్లభాయ్ పటేల్ , పొట్టి శ్రీరాములు తది తర దేశ నాయకులతో పాటు ప్రస్తుత నాయకులు చిత్రాలను కూడా గీసి వారి చరిత్రను విద్యార్థులకు వివరిస్తున్నారు . నాటి నుంచి నేటివరకు 500లకు పైగా చిత్రాలను గీసారు . అలాగే వారికి సంబం ధించిన చరిత్రను కూడా సేకరించి , తన తో పాటు విద్యార్థులకు బోధన ద్వారా తెలియజేస్తున్నారు . తన వద్ద చదువు కున్న విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉం డాలని , నిజాయితీగా బతకాలన్నదే తన ఆశయమని సత్యనారాయణ మాస్టారు చెబుతున్నారు . ఈయన చేస్తున్న ప్రయ త్నానికి పాఠశాల హెచ్ఎం జగన్నాథ రావుతో పాటు తోటి ఉపాధ్యాయులు కూ డా ఎంతో అభినందనలు చెబుతున్నారు .Thanks for reading Inspiration Teacher Mandala Satyannarayana
No comments:
Post a Comment