Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 29, 2020

PM Modi Message


PM Modi Message
PM Modi Message


భారతదేశ ప్రజలకు బహిరంగలేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్డీఏ-2 ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.. ఏడాది పాలనలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విషయాలను ప్రస్తావించారు.. ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పాలన పూర్తిచేసుకున్నామని పేర్కొన్న మోడీ.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది.. అనేక దశాబ్దాల తర్వాత దేశం పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి ఓటేసింది. భారతదేశం ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతుంది. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందన్నారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయన్నారు.
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు, ఇది "జాతీయ ఐక్యత మరియు సమైక్యత యొక్క స్ఫూర్తిని పెంపొందించింది" అని అన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రస్తావించారు మోడీ. దేశవ్యాప్తంగా నిరసనలు చూసిన పౌరసత్వ సవరణ చట్టంపై స్పందిస్తూ "ఇది భారతదేశం యొక్క కరుణ మరియు సమగ్ర స్ఫూర్తికి వ్యక్తీకరణ'అని పేర్కొన్నారు.

ఇక, సవాళ్లను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం శ్రమిస్తున్నామని పేర్కొన్న ప్రధాని మోడీ.. తమ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేసుకున్నారు.. అదేవిధంగా దేశం వేగంగా అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు.. అయితే, కరోనా కారణంగా వలస కార్మికులు, కూలీలు, ఇతరులు విపరీతమైన బాధలు అనుభవించారని... ఈ సంక్షోభంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగలేదని తాము చెప్పడం లేదన్నారు మోడీ. లాక్‌డౌన్‌తో వేల సంఖ్యలో వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.. స్వస్థలాలకు చేరుకునేందుకు నడక, సైకిళ్లు, ట్రక్కులను ఆశ్రయిస్తున్నారు. మన కూలీలు, వలస కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తులవారు, హస్త కళాకారులు, హాకర్లు ఈ సంక్షోభ సమయంలో తీవ్ర బాధలు అనుభవించారన్నారు. అయినప్పటికి ఈ బాధలు, ఇబ్బందులు, అసౌకర్యాలు విపత్తులుగా మారకుండా చూసుకోవాల్సిన సమయం ఇది అన్నారు. కరోనా దేశంలోకి వచ్చినప్పుడు.. భారత్‌ ప్రపంచానికి సమస్యగా మారుతుందని భయపడ్డారు.. కానీ, నేడు మనం తీసుకున్న చర్యలతో ప్రపంచమే మన వైపు చూస్తుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందన్న ఆయన.. భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం అని.. చప్పట్లు చరవడం, దీపాలు వెలిగించడం, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం, జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ నియమాలను పాటించడం.. ఇలా ప్రతీ సందర్భంలోనూ ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ అని నిరూపించారని పేర్కొన్నా ప్రధాని మోడీ. కాగా, కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూనే ఉన్నారు.. మరోవైపు.. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తారా? లేక, సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. లాక్‌డౌన్‌పై ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Thanks for reading PM Modi Message

No comments:

Post a Comment