Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 3, 2020

A.P లో ఉపాధ్యాయ బదిలీలకు C.M గ్రీన్ సిగ్నల్




*03–06–2020*

 *💁‍♂ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం*

 *అమరావతి:*

 *ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం పై సీ.ఎం. శ్రీ వై.యస్‌.జగన్‌ సమీక్ష : మంత్రి ఆదిమూలపు సురేష్ , పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ సహా ఇతర అధికారులు హాజరు*

*🌹విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు:*

– విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచాలని, రీ పొజిషన్‌ చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలను సీఎం ముందుంచిన అధికారులు

– విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం

– ఏయే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలన్న సీఎం

– విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలన్న సీఎం

– ఆన్‌లైన్‌ పద్ధతుల్లో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని, జులై 15 తర్వాత చేపడతామన్న అధికారులు

– ఎవర్నీ ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం కాకుండా పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోమన్న ముఖ్యమంత్రి

– అధికారులు అంతా కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో విధివిధానాలు రూపొందించాలన్న సీఎం

– 2017లో అనుసరించిన పద్దతులు కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలావరకు మూతబడ్డాయని సమావేశంలో ప్రస్తావన.

– ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం

– అక్టోబరు, నవంబరు నెలలు వచ్చినా యూనిఫారమ్స్, పుస్తకాలు ఇవ్వలేదన్న సీఎం

– ఇప్పుడు పిల్లలకు మంచిచేయాలనే ప్రయత్నాలు చేస్తున్నామన్న సీఎం.

*🌹పిల్లల ప్రతిభపై నిరంతర అధ్యయనం:*

– పిల్లలు నేర్చుకునే విధానం, వారికి చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలన్న సీఎం.

– 6వ తరగతి నుంచి 10 తరగతి వరకూ వివిధ పాఠశాల్లలో విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలన్న సీఎం

– విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి ఆ డేటాను అనలైజ్‌ చేయాలని, ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలని ఆదేశించిన సీఎం

– ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందడానికి నిర్ణయాలు తీసుకోవడంలో విప్లవాత్మకంగా ఆలోచించాలన్న అధికారులకు స్పష్టం చేసిన సీఎం.

– డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలని ఆదేశించిన సీఎం.

– విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి.

– ఈ అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయన్న సీఎం.

*🌹పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాలపై సమీక్ష:*

– నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలని, దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం.

– ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం

– నాడు– నేడు కింద పాఠశాలల నిర్మాణాల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్దతులు, విధివిధానాలను ఎస్‌ఓపీలుగా రూపొందించి వాటిని సంబంధిత విభాగాలకు పంపించాలన్న సీఎం

– గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలన్న సీఎం

– గవర్నమెంటు అంటే నాసికరం కాదు.. గవర్నమెంటు అంటే క్వాలిటీ అన్న పేరురావాలన్న ముఖ్యమంత్రి.

– నాడు – నేడు నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం ఇది అని పేర్కొన్న సీఎం

– నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్‌ కమిటీల ఖాతాల్లో ఉన్నాయన్న అధికారులు.

– గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్‌డౌన్‌ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని అధికారుల వెల్లడి.

– ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు,

–  గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని ఆదేశించిన సీఎం

– వీటికిచ్చే పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఎండకూడదని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి.

– జేసీలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం

– స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలన్న సీఎం. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ నెంబరుకు ఫోన్‌ చేసేలా నెంబరును ప్రదర్శించాలన్న సీఎం. తల్లిదండ్రులు ఎవరైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న సీఎం

– పాఠశాలలు పరిశుభ్రంగా, అలాగే బాత్‌రూమ్స్‌ కూడా శుభ్రంగా ఉంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం.

– జగనన్న విద్యా కానుక కోసం ఈనెల 8, 9 తేదీలలో విద్యార్థుల కాళ్ల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారుల వెల్లడి.


Thanks for reading A.P లో ఉపాధ్యాయ బదిలీలకు C.M గ్రీన్ సిగ్నల్

No comments:

Post a Comment