Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 8, 2020

Correction in 10th Class/ SSC Certificates - required documents- guidelines.


Correction  in 10th Class/ SSC Certificates - required documents- guidelines.
Correction  in 10th Class/ SSC Certificates - required documents- guidelines.


♦ఎస్ఎస్ సీ సర్టిఫికెట్లలో తప్పుల సవరణ

🔸సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ లో (ఎస్ఎస్సి) ఉన్న తప్పులు సరి చేసు కునేందుకు ఏపీ ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారికి జారీ చేసే ఎస్ఎస్సి సర్టిఫికెట్ లలోని తప్పుల సవరణకు చర్యలు చేపట్టింది.
🔹ఇన్నాళ్లూ సర్టిఫికెట్ లో తప్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు ఇకపై వాటిని సరిచేసుకునే అవకాశం లభించింది.
🔸అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటివి తప్పుగా ముద్రించ బడటంతో అనేకమంది ఉద్యోగవకాశాలు కోల్పోయారు.
🔹ఈ నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆ తప్పులు సవరించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అభ్యర్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
🔸ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు మార్గదర్శకాలు జారీ చేశారు.
🔹తప్పులు సరి చేసుకోవాల్సిన వారు విధిగా ఎనిమిది రకాల పత్రాలు సమర్పించాల్సి ఉంది.
🔸జిల్లాల్లోని ఉపవిద్యాశాఖాధికారు (డీవైఈఓ) ద్వారా ఈ సమాచారాన్ని ప్రచారం చేయించాలని డీఈఓలకు ఆదేశాలు అందాయి. తప్పుల సవరణ ప్రక్రియ సాధారణంగా జరుగుతున్నప్పటికీ, డీఈఓలు తమకొచ్చిన అర్జీలను నేరుగా విద్యాశాఖ కమిషనర్ కు పంపిస్తున్నారు
🔹దీనివల్ల పెండింగ్ దరఖాస్తులు పెరుగుతుండటంతో ఇలాంటి తప్పుల సవరణ అర్జీలను హెచ్ఎం స్థాయిలోనే ఫిల్టర్ చేసేందుకు చర్యలు చేపట్టింది.
🔸ఎస్ఎస్సీ సర్టిఫికెట్లలో ఉన్న తప్పులు సరి చేసుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, దానిని హెచ్ఎం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తమకు పంపించాలని కమిషనర్ స్పష్టం చేశారు. 
🔹ఎస్ఎస్ సీ సర్టిఫికెట్ లో తప్పుల సవరణకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మాను పూర్తి చేసిన అనంతరం డీఈఓ సంతకం చేసి, సీల్ వేశాకే కమిషనరేటకు పంపించాలని మార్గదర్శకాలలో పేర్కొ న్నారు.
🔸దరఖాస్తులు సరిగా లేకుంటే, అక్కడే తిరస్కరించే అధికారాన్ని హెచ్ఎంలకు కట్టబెట్టారు.
🔸టెస్త్ సర్టిఫికెట్లోని తప్పుల సవరణకు అభ్యర్థులు తమ అడ్మిషన్ దరఖాస్తు, రికార్డుషీటు, టీసీ, ఒరిజినల్ సర్టిఫికెట్, నామినల్ రోల్స్, తప్పు జరగడానికి కారణంపై విశ్లేషణ, తప్పు ఎక్కడ జరిగిందో హెచ్ఎం నివేదిక, ఒరిజినల్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ ను దరఖాస్తుతో జత చేసి పంపించాలని కమిషనర్ సూచించారు.
🔹ఇకపై ఇలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఇందు కోసం నామినల్ రోలను రూపొందించే సమయంలోనే పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Thanks for reading Correction in 10th Class/ SSC Certificates - required documents- guidelines.

No comments:

Post a Comment