Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 20, 2020

Have you completed these tasks? -గడువు ముగుస్తోంది.... ఈ పనులు పూర్తిచేశారా..?


Have you completed these tasks? -గడువు ముగుస్తోంది.... ఈ పనులు పూర్తిచేశారా..?

Have you completed these tasks? -గడువు ముగుస్తోంది.... ఈ పనులు పూర్తిచేశారా..?


లాక్​డౌన్​తో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అడ్డంకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా గడువు పెంచింది కేంద్రం. ఆ పనులు ఏమిటి? ఎప్పటిలోపు వాటిని పూర్తి చేయాలి అనే వివరాలు తెలుసుకోండి ఇప్పుడే.

దేశంలో ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను ఆదా పెట్టుబడులు సహా, ఆలస్యంగా ఆదాయపన్ను రిటర్ను (ఐటీఆర్​) దాఖలు చేసేందుకు ఇదే చివరి తేది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో ఈ గడువును జూన్​ 30 వరకు పొడిగించింది కేంద్రం. గడువు ముగిసేందుకు ఇంకా 9 రోజులే ఉంది. ఈ లోపు పూర్తి చేయాల్సిన 4 తప్పనిసరి పనులు.. వాటి వివరాలు మీ కోసం.

పన్ను ఆదా పెట్టుబడి

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమర్పించేందుకు జూన్ 30 చివరి తేదీ. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ పన్నుల ఫారంలో కొత్త టేబుల్​ను జత చేసింది. ఇందులో ఏప్రిల్, జూన్​లో 2019-20కి సంబంధించి పెట్టిన పెట్టుబడుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఆలస్య ఐటీఆర్

​ (2018-19)దాఖలు..సాధారణంగా ఐటీఆర్​ దాఖలుకు జులై 31 చివరి తేదీ. అయితే మదింపు సంవత్సరం ముగిసే వరకు (మార్చి 31 వరకు) రిటర్ను దాఖలు చేసే వీలుంటుంది. లాక్​డౌన్​ కారణంగా ఈ గడువు కూడా ఈ జూన్ 30 వరకు పెరిగింది. ఇంకా మీ రిటర్ను దాఖలు చేయకపోతే వెంటనే చేయడం మంచిది.ఇప్పటికే రిటర్ను దాఖలు చేసిన వారు మరోసారి దాఖలును సమీక్షించుకునేందుకు కూడా వీలుంటుంది.

చిన్న పథకాల్లో పెట్టుబడి..

పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్యా సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై) వంటి పథకాల్లో ఆర్థిక సంవత్సరం ముగింపులోగా కనీస పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటికీ గడువు పెంచిన నేపథ్యంలో జూన్ 30లోపు కనీస పెట్టుబడి పెట్టి.. మీ ఖాతాను క్రియాశీలంగా ఉంచుకోండి.పీపీఎఫ్​లో కనీసం రూ.500, ఎస్​ఎస్​వైలో రూ.250 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఆధార్​-పాన్​ అనుసంధానం..

పాన్‌కార్డ్​ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం ఇది వరకే తప్పనిసరి చేసింది ఆదాయ పన్ను విభాగం(ఐటీ). ఇందుకు జూన్​ 30ని చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పటికే చాలా సార్లు గడవు పెంచిన ఐటీ శాఖ.. మరో సారి గడవు పెంచే అవకాశాలు లేకపోవచ్చు. ఇంకా మీ ఆధార్​ కార్డును, పాన్​కు అనుసంధానం చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి.

Thanks for reading Have you completed these tasks? -గడువు ముగుస్తోంది.... ఈ పనులు పూర్తిచేశారా..?

No comments:

Post a Comment