Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 22, 2020

How to find pure honey ..?


How to find pure honey ..?: స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా..?
How to find pure honey ..?

    తేనె తియ్యని ఔషధం. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. గ్రామీణ ప్రాంతాల్లో తేనె విరివిగా దొరుకుతుంది. పంటపొలాలు, అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెతో పల్లెటూరి ప్రజలు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. కానీ పట్టణాలు, నగరాల్లో ఉండే వాళ్లు మాత్రం అంతగా లాభపడటం లేదు. పైగా అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన తేనె లభిస్తే...నగరాల్లో మాత్రం కల్తీ తేనె దొరుకుతోంది. కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తి కోసం తేనెలో బెల్లం పాకాన్ని కలిపి కల్తీ చేస్తున్నారు. మరి శుద్ధమైన తేనె, కల్తీ తేనెను ఎలా గుర్తించాలో తెలుసా..?


1. ఓ గ్లాస్ లో నీళ్లు తీసుకొని ఓ టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఆ తర్వాత కాస్త వెనెగర్ వేయాలి. నురుగు వస్తే అది కల్తీ తేనె.


2. అగ్గిపుల్లను తీసుకొని తేనెలో ముంచండి. ఆ పుల్లను అగ్గిపెట్టెపై గంధకానికి గీస్తే మండాలి. లేదంటే అది కల్తీ తేనె. ఎందుకంటే స్వచ్ఛమైన తేనెకు మండే స్వభావం ఉంటుంది. తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది.


3. గ్లాస్ మంచి నీటికి టేబుల్ స్పూన్ తేనె కలపండి. చెంచాతో కలపకుండా గ్లాస్‌ను అటూ ఇటూ తిప్పుతూ కలపాలి. తేనె నీటిలో కలిసిపోతే అది కల్తీది. అలాగే అడుగుభాగాన ఉండిపోతే అది స్వచ్ఛమైన తేనె.


4. బ్లాటింగ్ పేపర్ కు కాస్త తేనె రాయాలి. పేపర్ తడిసి పోతే అది కల్తీ తేనె.


5. చేతి బొటన వేలిపై కొంచెం తేనె వేయండి. చేతికి అలాగే అతుకుపోతే అది నాణ్యమైన తేనె. వేలి నిండా వ్యాపించి, జారిపోతే అది కల్తీది.

Thanks for reading How to find pure honey ..?

No comments:

Post a Comment