How to transfer money through WhatsApp
♦వాట్సాప్ ద్వారా డబ్బుల ట్రాన్స్ఫర్ ఎలా?
🔸యూపీఐ ఆధారితం..ఆండ్రాయిడ్, ఐఓస్ బీటా వినియోగదారులకు పేమెంట్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. యూపీఐ ఆధారితంగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించారు. డబ్బు పంపడం, తీసుకోవడం వంటి సేవలు ఇందులో ఉన్నాయి. చెల్లింపుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది వాట్సాప్. ఇది యూపీఐ ఆధారంగా పనిచేసినప్పటికీ చెల్లింపుల సమయంలో ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అవసరం లేదు.డబ్బు పంపించడం ఎలా?రెండు రకాలుగా వాట్సాప్ పేమెంట్ ద్వారా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు డబ్బు పంపించవచ్చు.
🔹ఇందుకోసం మొదట యూపీఐ ఖాతా ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌ను ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఇది ఒక్కసారి చేసే ప్రక్రియ కావడం వల్ల వినియోగదారుడికి ప్రతిసారి విసుగు ఉండదు.
యూపీఐ క్రియేషన్ ఎలా..?
🔸స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేస్తే... అందులో పై భాగం కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే.. పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే.. 'యాడ్ పేమెంట్'(ఏ పద్ధతిలో పేమెంట్ అనుసంధానం చేసుకుంటారు) అని అడుగుతుంది. అప్పుడు అక్కడ పలు బ్యాంక్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వెరిఫికేషన్ పేరిట సంక్షిప్త సందేశం వస్తుంది. వెరిఫై చేశాక.. ఆ నంబర్‌తో ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు ఏ బ్యాంక్‌ను సెట్అప్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఓకే(డన్) అని నొక్కితే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అయితే సిస్టమ్ ఆటోమెటిగా క్రియేట్ చేసిన ఐడీ నచ్చకపోతే.. మనకు నచ్చిన ఐడీ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది.
🔸ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో, పేమెంట్స్-న్యూ పేమెంట్స్- సెలక్ట్ కాంటాక్ట్స్- ఎంటర్ ఎమౌంట్-యూపీఐ పిన్ ఎంటర్ ఏయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత మీకు పూర్తయినట్లు అక్కడ డిస్ప్లేపై సందేశం కనిపిస్తుంది. ఇలా డబ్బులు పంపేందుకు యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్ కూడా వినియోగించవచ్చు.
మరొక పద్ధతి...
🔹వాట్సాప్ ఓపెన్ చేయాలి.ఎవరికి డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్‌ను ఎంచుకోవాలి.చాట్ సెట్టింగ్స్‌లో, పేమెంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఎంత డబ్బు పంపించాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
వాట్సాప్ పేమెంట్ ప్రయోజనాలు
🔸వాట్సాప్ ద్వారా ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా డబ్బు సులభంగా పంపించుకోవచ్చు. అయితే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికే డబ్బు పంపించేందుకు వీలవుతుంది.పేమెంట్ పూర్తయిన తర్వాత డబ్బు పంపించినవారికి, తీసుకున్నవారికి ఇద్దరికీ నోటిఫికేషన్ వస్తుంది.ఇందులో ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
🔹వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్... గూగుల్ పే, భీమ్ యాప్‌కీ గట్టి పోటీనివ్వనుంది. అయితే వాట్సాప్ పేమెంట్‌లో, గూగుల్ పే తరహాలో ఎలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ లేదు
Thanks for reading How to transfer money through WhatsApp
No comments:
Post a Comment