Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 24, 2020

Peanuts for heart health


గుండె ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు...  ఈ విధంగా తీసుకోండి....
Peanuts for heart health

ప్రతిరోజు ఓ గుప్పెడు పల్లీలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటివరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమయ్యింది. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలోరీలు ఉంటాయి. దీన్నిబట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్, పాలీ సాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీల లో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది.

పచ్చి పల్లీలు, వేయించిన, ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు... ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియాసిన్ లతోపాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల లో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

కేవలం హృదయ సంబంధిత జబ్బులను నివారించడం మాత్రమే కాదు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా, అసలు రాళ్లు అభివృద్ధి చెందకుండా చూసుకునేందుకు పల్లీలు ఎంతో సహాయ పడతాయి. పల్లీల లో పుష్కలంగా లభించే అమినో యాసిడ్స్ నాడీ కణాలకు సంబంధించిన కెరోటిన్ ని మన శరీరంలో బాగా ఉత్పత్తి చేసి మెదడు సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి. అందుకే పల్లీలు తింటే మతిమరుపు సమస్యలు ఎక్కువగా రావని అధ్యయనంలో తేలింది.

పల్లీల లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడుతుంది అన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తినండి. పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీల లో క్యాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి.

Thanks for reading Peanuts for heart health

No comments:

Post a Comment