Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 2, 2020

PMFBY - Offer to the farmers from central government .. 'Pradhan Mantri Fasal Bima Yojana' (PMFBY)



PMFBY - Offer to the farmers from central government .. 'Pradhan Mantri Fasal Bima Yojana' (PMFBY)


PMFBY -రైతులకు కేంద్రం అందించే  ఆఫర్.. చివరి తేదీ ఇదే!
PMFBY - Offer to the farmers from central government .. 'Pradhan Mantri Fasal Bima Yojana' (PMFBY)


 'ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY)

వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా.. చాలా మంది రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు అకారణంగా వృథా అవుతుంటాయి. దీంతో అప్పులు చేసి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతూంటారు. మరికొంత మంది రైతులైతే.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూంటారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY)ను ప్రారంభించింది.

ఈ స్కీమ్ ద్వారా అకాల వర్షం లేదా అధిక వర్షపాతం వల్ల పంట నష్టాన్ని కాస్తయినా భర్తీ చేయవచ్చు. ఇలాంటి 'ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం దరఖాస్తులు పెట్టుకోండి. ఖరీఫ్ పంటల బీమాకు చివరి తేదీ 2020 జులై 31గా విధించింది ప్రభుత్వం.
ఒకవేళ బీమా సౌకర్యం లేకుండా కేవలం రుణం కోరుకునే రైతులు చివరి తేదీకి 7 రోజుల ముందు.. తమ బ్యాంక్ శాఖకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. రైతులు సీఎస్సి, బ్యాంక్, ఏజెంట్ లేదా ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పంటల బీమాను స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కింద వడగళ్లు, భూమి నష్టం, నీటి లాగింగ్, క్లౌడ్ బరస్ట్, సహజ అగ్ని ప్రమాదం, తెగుళ్లు, తుఫానుల కారణంగా వ్యవసాయం నష్టపోతే.. కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. పకృతి విపత్తులో పంటలకు నష్టం జరిగినప్పుడు, రైతులకు పరిహారం ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.
ఈ స్కీమ్‌ ద్వారా ఎలా ప్రయోజనం పొందాలంటే.. విత్తనాలు వేసిన 10 రోజుల్లోపే దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి పకృత్తి విపత్తు కారణంగా మీ పంట దెబ్బతిన్నా కూడా.. బీమా ప్రయోజనం ఇస్తారు. రైతు ఫొటో, ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫీల్డ్ నెంబర్, పొలంలో పంటకు రుజువుకు సంబంధించిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎలాంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 1800 2005 142 లేదా 1800 1209 09090ను సంప్రదించవచ్చు.

Thanks for reading PMFBY - Offer to the farmers from central government .. 'Pradhan Mantri Fasal Bima Yojana' (PMFBY)

No comments:

Post a Comment