FLASH...FLASH

Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 30, 2020

Tholi Yekadasi : తొలి ఏకాదశి విశిష్టత


తొలి ఏకాదశి విశిష్టత:-

ఆషాఢ శుద్ధ ఏకాదశి. తొలి ఏకాదశి, శయన ఏకాదశి:-
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. పురాణాలను అనుసరించచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు..

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు  అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.

ఏకాదశి తిథి: 
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. 

ఏకాదశి నాడు ఏం చేయాలి: 
ఏకాదశి నాడు ఉపవాసం ఉంది.. ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి.. 

పేలాల పిండి: 
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు  పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.


 1. తొలి ఏకాదశి అన్ని ఏకాదశులలో కెల్ల ఉత్తమమైంది. 
 2. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. 
 3. విష్ణు భగవానుడు అలంకార ప్రియుడు. 
 4. మహా విష్ణువునకు పూలతో అలంకరణ చేసి విష్ణు సహస్ర నామ పారాయనం చేస్తూ విష్ణువును పూజించే రోజే ఈ ఏకాదశి తొలి ఏకాదశి. ఆషాఢమాసలో వచ్చే ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. 
 5. ఈ రోజు పాలసముద్రంలో విష్ణువు యోగనిద్రలోకి వెలతాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు.
 6. యోగ నిద్రకు సిద్ధమైన దేవుని కోసం భక్తులు ఉపవాసం చేస్తారు.
 7. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. 

 8. శయనైకాదశి ఉపవాస వివరాలను భవిష్యోత్తర పురాణంలో వివరింపబడింది. 
 9. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు. 
 10. శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. 
 11. ఉపవాసం చేసి శ్రీ హరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. 
 12. ప్రతి వైష్ణ దేవాలయంలోను స్వామికి పవళింపు సేవాఉత్సవం జరుపుతారు. 
 13. సర్వ దేవతా నివాస స్థానమైన గోవును కూడా ఈ ఏకాదశి రోజు పూజిస్తారు. 
 14. గోశాలలను శుభ్రం చేసి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. 
 15. మహా విష్ణువునకు అత్యంత ఇష్టమైన తులసి కోట దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి పలురకాల పండ్లను నివేదిన చేస్తారు. 
 16. ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు.
 17. వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. 
 18. ఏకాదశి వ్రతం చేసేవారిపై ఎల్లప్పుడు మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు. 
 19. మహా విష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశయ్యపైన పవళిస్తాడని ఋషులు,యోగులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని గడుపుతుంటారు. 
 20. దేశ సంచారులైన యతులు ఈ నాలుగు నెలలు ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. 
 21. ఏకాదశి ఉపవాసవ్రతం చేసుకున్నవారికి అశ్వమేధ యాగం చేసినంత, 
 22. అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి.


Thanks for reading Tholi Yekadasi : తొలి ఏకాదశి విశిష్టత

No comments:

Post a Comment