Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 16, 2020

Another 87 treatments under Arogyasree


ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు..
                Another 87 treatments under Arogyasree

➤ఇప్పటికే వెయ్యి రూపాయలకు మించిన 1000 చికిత్సా విధానాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలను చేరుస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

➤వాస్తవానికి ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుండే దాదాపు వెయ్యి చికిత్సా విధానాలను డాక్టర్ వైయస్ ఆర్ ఆరోగ్యశ్రీ పధకం పరిధిలోకి తెచ్చి పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందులో 200 చికిత్సా విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 12 జిల్లాల్లో అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

➤ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం తీరు తెన్నులను సమీక్షించిన డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తాజాగా రూ.1000 నుండి రూ. 45 వేల వరకూ ఖర్చయ్యే మరో 87 చికిత్సా విధానాలను ఈ పథకం పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.

➤ఇందులో ఇన్ పేషెంట్ కు అవసరమయ్యే 53 విధానాలతోపాటు, 29 స్వల్పకాలిక చికిత్సా విధానాలు, మరో 5 డేకేర్ విధానాలు ఉన్నాయి.

➤ఈ మేరకు పథకాన్ని విస్తరించాలని పైలట్ ప్రాజెక్టు సమీక్ష అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని సమగ్రంగా పరిశీలించిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ప్రస్తుతమున్న వెయ్యి చికిత్సా విధానాలకు అదనంగా మరో 87 చికిత్సా విధానాల్ని చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

➤దీంతో పాటు ప్రతి చికిత్సా విధానానికయ్యే ప్యాకేజీ రేట్లను ఆయా స్పెషాలిటీ విభాగం నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు మార్పు చేయాలని సూచించారు.

➤మొత్తం 87 చికిత్సా విధానాల అమలుకు సంబంధించి మార్పు చేసిన ఈ పైలట్ ప్రాజెక్టును ఈనెల 16 నుండి విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➤ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని వెల్లడించారు.  త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు.

Thanks for reading Another 87 treatments under Arogyasree

No comments:

Post a Comment